Government Employees: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు కనీస బేసిక్ ‌పే రూ. 23 వేలు

|

Jan 30, 2021 | 5:50 AM

Government Employees: కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస బేసిక్‌ పే రూ.23 వేలు, గరిష్ఠ వేతనం రూ.1.66 లక్షలుగానూ 11వ వేతన సవరణ కమిషన్‌ ...

Government Employees: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ప్రభుత్వ ఉద్యోగులకు కనీస బేసిక్ ‌పే రూ. 23 వేలు
Follow us on

Government Employees: కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కనీస బేసిక్‌ పే రూ.23 వేలు, గరిష్ఠ వేతనం రూ.1.66 లక్షలుగానూ 11వ వేతన సవరణ కమిషన్‌ నిర్ణయించింది. మోహన్‌దాస్‌ నేతృత్వంలోని కమిషన్‌ శుక్రవారం ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, ఆర్థిక మంత్రి థామస్‌ ఐజాక్‌లకు ఈ సిఫారసులను సమర్పించింది. సవరించిన వేతనం2019 జూలై 1 నుంచి వర్తిస్తాయి.
ఇంటి అద్దె అలవెన్స్‌ కనీసం రూ.1200, గరిష్ఠంగా రూ.10 వేలు చెల్లించాలని సిఫారసు చేసింది. విలేజ్‌ ఆఫీసర్స్‌కు రూ.1,500 ప్రత్యేక భత్యం చెల్లించాలని నిర్ణయించింది. అలాగే ఆరోగ్య శాఖలోని పారామెడికల్‌ సిబ్బందికి జీతాలను ఏకీకృతం చేయాలని తెలిపింది. ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపుపై ఈ కమిషన్‌ ఎటువంటి సిఫారసు చేయలేదు. అయితే ఈ ఏడాది పదవీ విరమణ చేయబోతున్న సుమారు 20 వేల మంది ఉద్యోగులకు పదవీ కాలాన్ని ఒక ఏడాది పాటు పెంచాలని సిఫారసు చేసింది. వేతన సవరణ వల్ల సర్కార్‌ ఖజానాపై అదనంగా రూ.4,810 కోట్ల భారం పడుతుంది.

అలాగే పెన్షన్‌ గ్రాట్యుయింటీ ఫండ్‌ పరిమితిని పెంచాలని నిర్ణయించింది. రూ.14 లక్షల నుంచి రూ.17 లక్షలకు పెంచాలని సిఫారసు చేసింది. 80 ఏళ్ల పింఛన్‌దారులకు అదనందా రూ.1,000 చెల్లించాలని పేర్కొంది.

Indian Railways: దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. 31 రైల్వే స్టేషన్లు మూసివేత..! ఎందుకంటే?