Farmers’ Protest : రైతు సంఘాలతో కేంద్రం చర్చలు వాయిదా.. చట్టాలను రద్దు చేసేదాకా విరమించేది లేదంటున్న అన్నదాతలు

|

Jan 19, 2021 | 5:42 AM

రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్చలు వరుసగా విఫలం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశరాజధానిలో

Farmers Protest : రైతు సంఘాలతో కేంద్రం చర్చలు వాయిదా.. చట్టాలను రద్దు చేసేదాకా విరమించేది లేదంటున్న అన్నదాతలు
Follow us on

Farmers’ Protest : రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం చేస్తున్న చర్చలు వరుసగా విఫలం అవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలంటూ దేశరాజధానిలో రైతులు 54 రోజులుగా నిరసన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతు సంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య ఈ నెల 19న జరగాల్సిన చర్చలు వాయిదా పడ్డాయి.

ఈ నెల 20 చర్చలు జరుపుతామంటూ కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ క్రమంలో ఈ నెల 20న మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్‌ భవన్‌లో చర్చలు జరగనున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతు సంఘాలతో పలు సార్లు చర్చలు జరిపినా ఎలాంటి పురోగతి కనిపించలేదు. మరో వైపు రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలను రద్దు చేసేదాకా ఎట్టిపరిస్థితుల్లో నిరసన విరమించేంది లేదంటూ రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

PM Modi Bengal Visit: ఈనెల 23న పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఏర్పాట్లు ముమ్మరం

Keeping Constant Watch: భారత భూభాగంలో చైనా నిర్మాణ పనులపై స్పందించిన భారత విదేశాంగ శాఖ