Viral: ప్రేయసి కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులను లెక్కరాసి.. యువకుడు సూసైడ్

|

Jun 01, 2022 | 8:35 AM

ఎంతగానే ప్రేమించిన అమ్మాయి పెళ్లికి నిరాకరించడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అతను రాసిన చివరి లేఖ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

Viral: ప్రేయసి కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులను లెక్కరాసి.. యువకుడు సూసైడ్
Representative Image
Follow us on

పెళ్లికి నిరాకరించారని ప్రేయసో, ప్రియుడో ఆత్మహత్య చేసుకునే వార్తల్ని తరచూ చూస్తుంటాం. కర్ణాటక(Karnataka)లోని చిక్‌మంగళూరు(Chikmagalur) జిల్లాలో ఓ విచిత్ర ప్రేమకథ వెలుగు చూసింది. ఆ ప్రేమ కథ ప్రియుడి ఆత్మహత్యతో విషాదాంతమైంది. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని చేతన్‌గా గుర్తించారు. ప్రేయసి కోసం ఇప్పటి వరకు చేసిన ఖర్చులను లెక్కరాసి.. ఆ మొత్తాన్ని వసూలు చేయాలంటూ లేఖ రాసి ప్రాణాలు తీసుకున్నాడు.  తొమ్మిదేళ్లుగా ఓ యువతిని ప్రేమించాడు చేతన్‌. ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఆమె సరదాలు, సంతోషాల కోసం బాగా ఖర్చు చేయాల్సి వస్తోందంటూ స్నేహితులతో చెప్పి వాపోయేవాడు. పెళ్లి చేసుకుందామని చేతన్‌ ప్రతిపాదించగా ఆమె ససేమిరా అంది. ఆమె ప్రవర్తనతో విసిగిపోయి చివరకు జీవితంపై విరక్తి  చెంది ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని స్నేహితులు పోలీసులకు తెలిపారు. అతని మృతదేహం వద్ద ఓ లెటర్‌ దొరికింది. ప్రేయసి సరదాల కోసం 4లక్షల 50వేలు ఖర్చు చేశానని..ఆ మొత్తాన్ని ఆమె నుంచి వసూలు చేసి తన కుటుంబానికి అందించాలని పోలీసులను కోరాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..