Mamata banerjees: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆహ్వానం కొత్తదేమీ కాదు..కాంగ్రెస్ పార్టీ నేతల పెదవి విరుపు

| Edited By: Anil kumar poka

Jul 25, 2021 | 10:23 AM

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రతిపాదన, పంపిన ఆహ్వానం కొత్తదేమీ కాదని కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. గతంలో కూడా ఆమె ఈ విధమైన..

Mamata banerjees: బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆహ్వానం కొత్తదేమీ కాదు..కాంగ్రెస్ పార్టీ నేతల పెదవి విరుపు
Mamata Banerjees Invitation Not New Says Congress
Follow us on

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకం కావాలంటూ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన ప్రతిపాదన, పంపిన ఆహ్వానం కొత్తదేమీ కాదని కాంగ్రెస్ పార్టీ పెదవి విరిచింది. గతంలో కూడా ఆమె ఈ విధమైన ఆహ్వానాలు పంపారని ఈ పార్టీ నేత, ఎంపీ ప్రదీప్ భట్టాచార్య తెలిపారు. అయితే ఈ ఆహ్వానాన్ని తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చురుకుగా పరిశీలిస్తున్నారని ఆయన చెప్పారు. దీనిపై ఆమె త్వరలో తుది నిర్ణయం తీసుకుంటారన్నారు. నిజానికి బీజేపీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ సంఘటితం కావాలని సోనియా ఇదివరకే పిలుపునిచ్చారని ఆయన అన్నారు. పైగా ఈ విషయమై చర్చలకు రావాలని ఆమె ఆహ్వానాలు పంపినా తృణమూల్ కాంగ్రెస్ నేతలు హాజరు కాలేదన్నారు. పౌరసత్వ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసన తెలపాలని, ఇందుకు సమావేశమవుదామని సోనియా గత ఏడాది జనవరిలో పిలుపునిచ్చినప్పటికీ ఆ పార్టీ స్పందించలేదని ఆయన చెప్పారు. ఏమైనా.. ఓ ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పడాలని ప్రజలంతా కోరుతున్న సమయం ఆసన్నమైందని ప్రదీప్ భట్టాచార్య పేర్కొన్నారు.

2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సోనియా నాయకత్వంలో విపక్షాలన్నీ ఒక్కటి కావాలన్నారు. జాతీయ, రాష్ట్ర స్థాయిలో తృణమూల్ కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమని బెంగాల్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు, ఎంపీ దీప్తిమాన్ ఘోష్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో భట్టాచార్య ఈ మేరకు స్పందించారు. అయితే సోనియా నాయకత్వమే బెటర్ అని కాంగ్రెస్ కోరుతుండగా.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కూడా తక్కువేమీ కాదని, ఆమె ఆధ్వర్యంలో విపక్షాలు సమైక్యం కావాలని ఈ పార్టీ నేతలు అంటున్నారు. మమత త్వరలో ఢిల్లీని సందర్శించి సోనియా గాంధీ, తదితర నేతలను కలుసుకోనున్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి : వెంకటేష్ గారు కాళ్లు పట్టుకున్నప్పుడు!అంటూ ఇంట్రస్టింగ్ విషయాలు చెప్పిన విలక్షణ నటుడు శ్రీతేజ్‌..:Narappa Shritej Video.

 News Watch: లక్ష కోట్ల దళిత బంధు.. మరిన్ని వార్తా కధనాల సమాహారం కొరకు వీక్షించండి న్యూస్ వాచ్… ( వీడియో )

 ఓరి దేవుడో…వ్యాక్సిన్‌ కోసం..జుట్టు ఉడేలా కొట్టుకున్న మహిళలు..వైరల్ అవుతున్న వీడియో..:Women fight for vaccine Video.

 ఆ ఊరిలో నిధినిక్షేపాల బావి..!అందుకేనేమో అక్కడికి వెళ్లినవారు తిరిగిరారట..అది ఏంటో తెలుసుకుందాం..:Mysterious Village Video.