టెక్స్‌టైల్‌ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం..

| Edited By:

Jun 09, 2020 | 6:07 PM

గుజరాత్‌లో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌లోని రఘువీర్‌ టెక్స్‌టైల్ మార్కెట్లో సోమవారం రాత్రి 11.45 గంటలకు భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది.

టెక్స్‌టైల్‌ మార్కెట్లో భారీ అగ్నిప్రమాదం..
Follow us on

గుజరాత్‌లో మరోసారి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సూరత్‌లోని రఘువీర్‌ టెక్స్‌టైల్ మార్కెట్లో సోమవారం రాత్రి 11.45 గంటలకు భారీ అగ్రిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే.. స్థానిక ఫైర్‌ సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు 20 ఫైర్‌ ఇంజన్లు అక్కడికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. దాదాపు మూడు గంటలపాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. రాత్రి సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో.. పెద్ద ప్రమాదం తప్పిందని.. ఆ సమయంలో అక్కడి మార్కెట్లో మనుషులు ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదన అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనకు కారణం ఇంకా తెలియరాలేదని.. అయితే సంఘటనా స్థలంలో తమకు మూడు ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు లభించాయని తెలిపారు. కాగా, ఇదే ప్రాంతంలో జనవరిలో రెండు సార్లు అగ్పిప్రమాదం జరిగిందని.. ఇలా ఈ ఏడాదిలోనే మూడు సార్లు అగ్నిప్రమాదం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. మొదటి సారి జరిగిన అగ్నిప్రమాదంపై ఇంకా దర్యాప్తు కొనసాగుతుందని.. ఈ క్రమంలో ఇలా మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకోవడం జరిగిందని తెలిపారు.