నేడే బలపరీక్ష.. మహారాష్ట్రలో ఏం జరగబోతోంది..?

| Edited By:

Nov 30, 2019 | 8:18 AM

ఒక కొలిక్కి వచ్చినట్లుగానే కనిపిస్తోన్న మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా ముగియలేదు. పలు హైడ్రామాల మధ్య ఇటీవల మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘాడీ (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం తన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ కూటమికి ఇవాళే అసలు పరీక్ష ఉంది. నేడు అసెంబ్లీలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోనుంది. అంసెబ్లీలో బలనిరూపణకు […]

నేడే బలపరీక్ష.. మహారాష్ట్రలో ఏం జరగబోతోంది..?
Follow us on

ఒక కొలిక్కి వచ్చినట్లుగానే కనిపిస్తోన్న మహారాష్ట్ర రాజకీయాలు ఇంకా ముగియలేదు. పలు హైడ్రామాల మధ్య ఇటీవల మహారాష్ట్రలో మహా వికాస్ ఆఘాడీ (శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ కూటమి తరఫున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే శుక్రవారం తన బాధ్యతలు స్వీకరించారు. అయితే ఈ కూటమికి ఇవాళే అసలు పరీక్ష ఉంది. నేడు అసెంబ్లీలో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం బల పరీక్షను ఎదుర్కోనుంది. అంసెబ్లీలో బలనిరూపణకు ఠాక్రే ప్రభుత్వానికి ఆ రాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ  డిసెంబర్ 3వరకు గడువు ఇవ్వగా.. శనివారమే మెజారిటీని నిరూపించుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్సీపీ ఎమ్మెల్యే దిలీప్ వాల్సే పాటిల్‌కు కొత్త ప్రొటెం స్పీకర్‌గా బాధ్యతలు అప్పగించారు.

కాగా 288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్రలో ప్రభుత్వ కొనసాగింపుకు  కావాల్సిన మేజిక్ ఫిగర్ 145. ప్రస్తుతం బీజేపీకి 105, శివసేనకు 56, ఎన్సీపీకి 54, కాంగ్రెస్‌కు 44 మంది సభ్యులు ఉన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ కూటమి తమకు 162 మంది ఎమ్మెల్యేల బలం ఉందని ప్రకటించింది. దీంతో ఇవాళ జరిగే బలపరీక్షలో మహావికాస్ అఘాడీ కూటమినే నెగ్గే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే మధ్యాహ్నం 2గంటల సమయంలో ఈ విశ్వాసపరీక్ష జరగనున్నట్లు తెలుస్తోంది.