కరోనా రోగులకు ఆ రెండు మెడిసిన్‌లు ‘ఫ్రీ’: సీఎం

| Edited By:

Jun 28, 2020 | 5:24 PM

కరోనా చికిత్సలో వాడుతున్న రెమ్‌డిసివిర్, ఫవిపిరవిర్ మెడిసిన్‌లను రోగులకు ఉచితంగా అందించాలన్న యోచనలో ఉన్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే  అన్నారు.

కరోనా రోగులకు ఆ రెండు మెడిసిన్‌లు ఫ్రీ: సీఎం
Follow us on

కరోనా చికిత్సలో వాడుతున్న రెమ్‌డిసివిర్, ఫవిపిరవిర్ మెడిసిన్‌లను రోగులకు ఉచితంగా అందించాలన్న యోచనలో ఉన్నామని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే  అన్నారు. కరోనా పరిస్థితులపై మాట్లాడిన ఆయన.. రోజురోజుకు కేసులు పెరుగుతున్న క్రమంలో పరీక్షల సామర్ధ్యాన్ని పెంచామని తెలిపారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు ‘ఛేజ్‌ ద వైరస్‌’ పేరుతో కొత్త కార్యక్రమం చేపడుతున్నామని సీఎం చెప్పుకొచ్చారు. కరోనా రోగులకు కేంద్ర ప్రభుత్వం అనుమతిని ఇచ్చిన డెక్సామెథాసోన్‌ని ఇప్పటికే తమ వైద్యులు వాడుతున్నారని, రాష్ట్రంలో ప్లాస్మా థెరఫీ కూడా మంచి ఫలితాలు అందిస్తోందని పేర్కొన్నారు

ఇక ఫ్లాస్మా థెరఫీతో మంచి ఫలితాలు ఉన్నందున సోమవారం నుంచి ఆ థెరఫీ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్లాస్మా దానం చేయడానికి కోలుకున్న వారు ముందుకు రావాలని ఠాక్రే పిలుపునిచ్చారు. మరోవైపు కేసులు పెరుగుతున్న  క్రమంలో జూన్‌ 31 తర్వాత కూడా రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని సీఎం తెలిపారు.