Corona in India: క్రమంగా పెరుగుతోన్న కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలో మాస్కు నిబంధన తప్పనిసరి

|

Jun 04, 2022 | 2:55 PM

కొన్ని రోజులుగా నిలకడగా నమోదవుతున్న రోజువారి కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు...

Corona in India: క్రమంగా పెరుగుతోన్న కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలో మాస్కు నిబంధన తప్పనిసరి
Uddav
Follow us on

కొన్ని రోజులుగా నిలకడగా నమోదవుతున్న రోజువారి కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రజలు, అధికారులు అప్రమత్తమయ్యారు. మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లోనే అత్యధిక సంఖ్యలో కొత్త కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలతో మహారాష్ట్ర(Maharashtra) ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా రాకుండా కట్టడి చేసే చర్యలు ప్రారంభించింది. దీంతో గతంలో సడలించిన నియమాలను మళ్లీ విధించే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా బహిరంగ ప్రదేశాల్లో మాస్క్‌(Mask) ధరించే నిబంధనను మళ్లీ తప్పనిసరి చేసింది. ఈ మేరకు అదనపు చీఫ్‌ సెక్రటరీ జిల్లా అధికారులకు లేఖ రాశారు. రైళ్లు, సినిమాలు, బస్సులు, ఆడిటోరియంలు, ఆఫీసులు, ఆసుపత్రులు, కాలేజీలు, స్కూళ్లు వంటి ప్రదేశాల్లో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్కులు ధరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అంతే కాకుండా టెస్టింగ్‌, ట్రాకింగ్‌ను వేగవంతం చేయాలని సూచించారు.

ఇటీవలే మహారాష్ట్రలో బీఏ.4, బీఏ.6 సబ్‌ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా నిబంధనలూ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. దాదాపు మూడు నెలల తర్వాత తొలిసారిగా జూన్‌ 1వ తేదీన మహారాష్ట్రలో రోజువారీ కేసుల సంఖ్య వెయ్యి దాటింది. ముఖ్యంగా ముంబయి మెట్రోపాలిటన్‌ రీజియన్‌తో పాటు, థానే ప్రాంతాల్లో కేసులు భారీగా పెరిగాయి. పాజిటివిటీ రేటు కూడా ఎక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.

మరాఠి నూతన సంవత్సరం గుడిపడ్వా పర్వదినం సందర్భంగా గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వైరస్ కేసులు తగ్గినందున మాస్కులు తప్పనిసరిగా ధరించాలనే నిబంధనను తొలగించింది. మాస్కులు వాడడం, వాడకపోవడం అనేది ప్రజల వ్యక్తిగత అభిప్రాయమని, అది తప్పనిసరి కాదని వెల్లడించింది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా మాస్కులు ధరించాల్సిందేనని ఆదేశాలివ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి