Bhima-Koregaon Case: వయసు, అనారోగ్యం దృష్ట్యా వరవరరావును జేజే ఆస్పత్రికి తరలించడానికి మహా సర్కార్ అంగీకారం

|

Jan 22, 2021 | 11:44 AM

ఎల్గార్‌ పరిషద్‌ కేసులో అరెస్టైన విప్లవ కవి వరవరరావు అనారోగ్యంతో బాధపడుతూ.. గత కొంతకాలంగా నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని జేజే హాస్పటల్..

Bhima-Koregaon Case: వయసు, అనారోగ్యం దృష్ట్యా వరవరరావును జేజే ఆస్పత్రికి తరలించడానికి మహా సర్కార్ అంగీకారం
Follow us on

Bhima-Koregaon Case: ఎల్గార్‌ పరిషద్‌ కేసులో అరెస్టైన విప్లవ కవి వరవరరావు అనారోగ్యంతో బాధపడుతూ.. గత కొంతకాలంగా నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన్ని జేజే హాస్పటల్‌ ప్రిజన్‌ వార్డుకు తరలించేందుకు సుముఖంగా తాము సుముఖంగా ఉన్నామని ముంబై హైకోర్టుకు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గత కొంతకాలంగా నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వరవరరావును డిశ్చార్జ్‌ చేయవచ్చని హాస్పటల్‌ సిబ్బంది కోర్టుకు తెలిపింది. డిశ్చార్జ్‌ అనంతరం ఆయన్ను నవీ ముంబైలోని తలోజా జైలుకు పంపాల్సిఉంటుంది.

అయితే 81 ఏళ్ల వరవరరావు ను జైలుకు తరలించేందుకు బదులుగా జేజే హాస్పటల్‌ ప్రిజన్‌ వార్డుకు తరలించేందుకు మహారాష్ట్ర సర్కార్ రెడీగా ఉందని.. ప్రభుత్వ న్యాయవాది దీపక్‌ ధాకరే కోర్టుకు చెప్పారు. అక్కడ ఆయనకు చికిత్స కొనసాగుతుందని, ఆయన కుటుంబసభ్యులు ప్రొటోకాల్స్‌కు లోబడి ఆయన్ను కలవచ్చని చెప్పారు. తమ ప్రభుత్వం తరఫు ఈ సడలింపులకు ఓకేఅని, మిగిలిన అంశాలు ఎన్‌ఐఏ పరిధిలోకి వస్తాయన్నారు.

ఆయన వయసు, ఆరోగ్యం దృష్ట్యా వరవరరావు పట్ల మానవీయ ధృక్పధాన్ని అవలంబించాలన్న కోర్టు సూచన మేరకు తమ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. అనంతరం ఎన్‌ఐఏ న్యాయవాది అనిల్‌ సింగ్‌ వాదిస్తూ, రావును జేజే ఆస్పత్రికి తరలించేందుకు సుముఖమన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అప్రస్తుతమైన అంశమని చెప్పారు. కవి,విప్లవ రచయిత,సామాజిక ఉద్యమకారుడు వరవరరావు ఎల్గార్‌ పరిషద్‌ కేసులో అరెస్టై.. గత కొంతకాలంగా జైలు శిక్షఅనుభవిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read: చైనా గనిలో వర్కర్ల వెలికితీతపై కొనసాగుతున్న ప్రయత్నాలు.. మరో 15 రోజులు పట్టవచ్చని అంచనా