ముగిసిన ఎన్‌కౌంటర్‌.. పాక్ తీరుపై మండిపడుతున్న సైన్యం..

| Edited By:

Apr 06, 2020 | 11:36 PM

ప్రపంచమంతా ఓ వైపు కరోనాపై పోరాడుతూ ఉంటే.. పాకిస్థాన్ మాత్రం తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టుకుంది. ఓ వైపు పాక్‌లో కూడా కరోనా విళయ తాండవం చేస్తుంటే.. అక్కడి ప్రభుత్వం మాత్రం.. భారత్‌పై దాడులకు పాల్పడుతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను దేశంపైకి ఎగదోస్తోందని భారత ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌ చేసే ఈ చర్యలు ఎంత మాత్రం సహించరానివని పేర్కొంది. గత ఐదు రోజులుగా కొనసాగుతున్న రంగ్‌దౌరీ బెహక్ ఆపరేషన్.. సోమవారంతో ముగిసిందని.. ఆర్మీ అధికారులు […]

ముగిసిన ఎన్‌కౌంటర్‌.. పాక్ తీరుపై మండిపడుతున్న సైన్యం..
Follow us on

ప్రపంచమంతా ఓ వైపు కరోనాపై పోరాడుతూ ఉంటే.. పాకిస్థాన్ మాత్రం తన వక్రబుద్దిని మరోసారి బయటపెట్టుకుంది. ఓ వైపు పాక్‌లో కూడా కరోనా విళయ తాండవం చేస్తుంటే.. అక్కడి ప్రభుత్వం మాత్రం.. భారత్‌పై దాడులకు పాల్పడుతోంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను దేశంపైకి ఎగదోస్తోందని భారత ఆర్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పాక్‌ చేసే ఈ చర్యలు ఎంత మాత్రం సహించరానివని పేర్కొంది.

గత ఐదు రోజులుగా కొనసాగుతున్న రంగ్‌దౌరీ బెహక్ ఆపరేషన్.. సోమవారంతో ముగిసిందని.. ఆర్మీ అధికారులు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో భారత సైన్యం ఐదుగురు ఉగ్రవాదులను హతమార్చిందని లెఫ్టినంట్ జనరల్ బీఎస్ రాజు తెలిపారు. ఈ రంగ్‌దౌరీ ఆపరేషన్.. మొత్తం ఐదురోజులు కొనసాగిందని.. ఏప్రిల్ ఒకటవ తేదీన పాకిస్తానీయులు దేశంలోకి చొరబడినట్లు తెలిసిందన్నారు. వెంటనే అక్కడకు చేరుకుని ఐదుగురు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిపారు. అయితే ఈ ఆపరేషన్‌లో స్పెషల్ ఆర్మీ ఫోర్సెస్‌కు చెందిన ఐదుగురు భారత జవాన్లు వీరమరణం పొందినట్లు తెలుపుతూ ఆవేదన వ్యకత్ం చేశారు. వీరిలో పలువురు తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ప్రాణాలు విడిచినట్లు అధికారులు తెలిపారు.
కాగా.. ఉగ్రవాదులను మట్టుబెట్టిన ప్రాంతంలో.. మేడ్ ఇన్ పాకిస్థాన్‌ లేబుల్‌తో ఉన్న పలు ఆహార పదర్ధాలతో పాటు.. బట్టలు, మిలటరీకి చెందిన పలు ఎక్విప్‌మెంట్స్‌ దొరికినట్లు ఆర్మీ వెల్లడించింది.