‘కరోనా’ను కృష్ణుడు పంపాడట.. కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

| Edited By:

Jun 29, 2020 | 7:00 PM

కరోనా మహమ్మారిని శ్రీకృష్ణుడు పంపారని ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్‌ దస్మానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్‌లో మాట్లాడిన సూర్యకాంత్‌.. కరోనా వైరస్‌, కృష్ణ రెండూ ‘క’ శబ్ధంతో మొదలవుతాయని, అందుకే ఈ వైరస్‌ను శ్రీకృష్ణుడే పంపారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు. హిందూ దేవతలతో కరోనాను పోల్చడం ఏంటని వారు మండిపడుతున్నారు. మరో నెటిజన్‌ […]

కరోనాను కృష్ణుడు పంపాడట.. కాంగ్రెస్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
Follow us on

కరోనా మహమ్మారిని శ్రీకృష్ణుడు పంపారని ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు సూర్యకాంత్‌ దస్మానా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ టీవీ చానెల్‌లో మాట్లాడిన సూర్యకాంత్‌.. కరోనా వైరస్‌, కృష్ణ రెండూ ‘క’ శబ్ధంతో మొదలవుతాయని, అందుకే ఈ వైరస్‌ను శ్రీకృష్ణుడే పంపారని ఆయన వ్యాఖ్యానించారు. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పలువురు ఘాటుగా స్పందిస్తున్నారు. హిందూ దేవతలతో కరోనాను పోల్చడం ఏంటని వారు మండిపడుతున్నారు. మరో నెటిజన్‌ ”కాంగ్రెస్‌ నేతలకు హిందు దేవుడంటే ఎందుకు అంత కోపం” అంటూ కామెంట్ పెట్టారు. కాగా భారత్‌లో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 5లక్షలను దాటేసిన విషయం తెలిసిందే.