Viral News: రోడ్డు మీదకు జనాల పరుగులు.. ఏంటా అని చూస్తే షాక్..!

Viral News: మద్యం రవాణా చేస్తున్న వాన్‌ బోల్తా పడింది. దీంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మద్యం బాటిళ్లను స్థానికులు లూటీ చేశారు. తమిళనాడులోని మధురైలో ఈ ఘటన జరిగింది.

Viral News: రోడ్డు మీదకు జనాల పరుగులు.. ఏంటా అని చూస్తే షాక్..!
Liquor

Updated on: May 12, 2022 | 6:50 AM

Viral News: మద్యం రవాణా చేస్తున్న వాన్‌ బోల్తా పడింది. దీంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిన మద్యం బాటిళ్లను స్థానికులు లూటీ చేశారు. తమిళనాడులోని మధురైలో ఈ ఘటన జరిగింది. సుమారు పది లక్షల రూపాయలు విలువైన మద్యాన్ని రవాణా చేస్తున్న వాహనం మధురై సమీపంలోని విరగనూరు ప్రాంతంలోని జాతీయ రహదారిపై బోల్తా పడింది. దీంతో మద్యం సీసాలున్న బాక్స్‌లు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. గమనించిన స్థానికులు అందినకాడికి మద్యం సీసాలు, పెట్టెలను తమ వెంట తీసుకుపోయారు. కాగా, ఈ ఘటన నేపథ్యంలో ఆ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. కాగా.. ఫొటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఏప్రిల్‌ 20న మధ్యప్రదేశ్‌లో కూడా ఇలాంటి సంఘటనే జరిగింది.