Weather Update: దేశవ్యాప్తంగా జూలై నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. వెల్లడించిన వాతావరణ శాఖ!

|

Aug 02, 2021 | 2:39 PM

దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు, మేఘాలు విరుచుకుపడటం అదేవిధంగా  కొండచరియలు విరిగిపడిన సంఘటనల మధ్య, వాతావరణ శాఖ జూలైలో వర్షపాత డేటాను విడుదల చేసింది.

Weather Update: దేశవ్యాప్తంగా జూలై నెలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం.. వెల్లడించిన వాతావరణ శాఖ!
Weather Update
Follow us on

Weather Update: దేశంలోని అనేక ప్రాంతాల్లో వరదలు, మేఘాలు విరుచుకుపడటం అదేవిధంగా  కొండచరియలు విరిగిపడిన సంఘటనల మధ్య, వాతావరణ శాఖ జూలైలో వర్షపాత డేటాను విడుదల చేసింది. దీని ప్రకారం, గత నెలలో దేశంలో సాధారణం కంటే 7% తక్కువ వర్షపాతం నమోదైంది. జూలై మొదటి వారంలో రుతుపవనాలు ఊపందుకున్నాయని, అయితే చివరికి నెలలో 7%లోటుతో ముగిసిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.  ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మొహపాత్రా జూలైలో -7%వర్షపాతం నమోదైందనీ, ఇది దీర్ఘకాల సగటులో 93% అనీ చెప్పారు.  96-104 పరిధి సాధారణమైనదిగా పరిగణిస్తారు. 90-96శాతం కంటే పరిధి సాధారణ కంటే తక్కువగా లెక్కచేస్తారు.  జులైలో సాధారణ వర్షపాతం ఉంటుందని ఐఎండీ అంచనా వేసింది.

జూలై నెలలో మహారాష్ట్ర తీరప్రాంతంలో భారీ వరదలను ఎదుర్కొంది.  మధ్య మహారాష్ట్ర, గోవా, కర్ణాటక జులైలో భారీ వర్షాలు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని అనేక పట్టణాలు, నగరాల్లో భారీ వర్షాల కారణంగా అనేక కొండచరియలు విరిగిపడిన సంఘటనలు జరిగాయి.  చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఆస్తి నష్టం జరిగింది.

ఉత్తర భారత రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్‌లో కూడా క్లౌడ్‌బరస్ట్ సంఘటనలు జరిగాయి. దీనికరణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఢిల్లీలో కూడా చాలా మంచి వర్షపాతం నమోదైంది. ఇవన్నీ ఉన్నప్పటికీ, రుతుపవనాలు జూలైలో దాని కోటాను నెరవేర్చలేకపోవడం గమనార్హం.

జూన్ 3 న కేరళకు రుతుపవనాలు చేరుకున్నాయని, జూలైలో సాధారణ వర్షపాతం ఉంటుందని మేము అంచనా వేసాము. ఇది ఎల్పీఏ లో 96% అని మొహపాత్ర చెప్పారు. జులై నెల దేశంలో అత్యధిక వర్షపాతాన్ని తెస్తుంది. అయితే జూలై 8 వరకు ఉత్తర భారతదేశంలో ఎక్కడా వర్షాలు లేవు. ఈ కారణంగా ఈ కొరత నమోదు అయింది అని ఆయన వెల్లడించారు.

నైరుతి రుతుపవనాలు జూన్ 3 న కేరళకు చేరుకున్నాయి. ఇది సాధారణ షెడ్యూల్ కంటే రెండు రోజులు ఆలస్యం అయినట్టు. జూన్ 19 నాటికి, ఇది తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలను వేగంగా కవర్ చేసింది. ఆ తర్వాత అది మందగించింది. చాలా ప్రాంతాలు వర్షం కోసం వేచి ఉండాల్సి వచ్చింది. జూలై 8 నుంచి మళ్లీ రుతుపవనాలు మొదలయ్యాయి.

నైరుతి రుతుపవనాలు జూలై 13 న ఢిల్లీకి చేరుకున్నాయి. 16 రోజుల ఆలస్యం తర్వాత, రెండు నెలల్లో సాధారణ వర్షపాతం కంటే 1% తక్కువ. ఆ రోజు అది దేశం మొత్తాన్ని కవర్ చేసింది. గతంలో జూన్‌లో సాధారణం కంటే 10% ఎక్కువ వర్షం కురిసింది. సాధారణంగా వర్షాకాలం 4 నెలల సీజన్‌లో, జూలై, ఆగస్టులో అత్యధిక వర్షపాతం ఉంటుంది.

మొత్తంగా, దేశంలో జూన్ 1 నుండి జూలై 31 వరకు సాధారణ వర్షపాతం కంటే ఒక శాతం తక్కువగా నమోదైంది. ఐఎండీ  తూర్పు మరియు వాయువ్య సబ్ డివిజన్లలో 13% తక్కువ వర్షపాతం నమోదైంది. ఉత్తర భారతదేశాన్ని కవర్ చేసే నార్త్-వెస్ట్ డివిజన్ 2% తగ్గుదల నమోదు చేసింది. దక్షిణ ద్వీపకల్పం డివిజన్, దక్షిణ రాష్ట్రాలను కవర్ చేస్తుంది. ఇక్కడ 17% ఎక్కువ వర్షపాతం నమోదైంది. సెంట్రల్ ఇండియా డివిజన్‌లో సాధారణం కంటే 1% ఎక్కువ వర్షపాతం నమోదైంది.

Also Read: మొబైల్ వినియోగదారులకు కేంద్రం హెచ్చరిక.. అలా చేయకపోతే ఇబ్బందులు తప్పవంటూ..

Danish Siddiqui: భారతీయ ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీని తాలిబన్లే కాల్చి చంపారు.. ఆఫ్ఘన్ భద్రతాదళాల ధ్రువీకరణ