Encounter: శ్రీనగర్‌లో పోలీసులపై ఉగ్రవాదుల దాడి.. ఎన్‌కౌంటర్‌లో లష్కర్ టెర్రరిస్ట్ హతం!

|

Oct 09, 2021 | 6:56 AM

శ్రీనగర్‌లోని నాటిపోరా ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసు బృందంపై మిలిటెంట్లు దాడి చేశారు. ఈసందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్ లో ఒక లష్కర్ ఉగ్రవాది హతమయ్యాడు.

Encounter: శ్రీనగర్‌లో పోలీసులపై ఉగ్రవాదుల దాడి.. ఎన్‌కౌంటర్‌లో లష్కర్ టెర్రరిస్ట్ హతం!
Encounter At Srinagar
Follow us on

Encounter: శ్రీనగర్‌లోని నాటిపోరా ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసు బృందంపై మిలిటెంట్లు దాడి చేశారు. ఈసందర్భంగా జరిగిన ఎన్‌కౌంటర్ లో ఒక లష్కర్ ఉగ్రవాది హతమయ్యాడు. అతని సహచరుడు తప్పించుకోగలిగాడు. మరణించిన ఉగ్రవాది నుండి ఆయుధాలు, భారీ స్థాయిలో పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు ఒక పోలీసు అధికారి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మరణించిన ఉగ్రవాది ట్రెంజ్ షోపియాన్ నివాసి అని అతని వద్ద లభించిన ఐడెంటిటీ కార్డు ద్వారా తెలిసింది. ఇతని పేరు ఆఖిబ్ బషీర్ కుమార్. ఇతను నిషేధిత తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబా కోసం పనిచేస్తున్నాడు. ఈ దాడి తరువాత ఆ ప్రాంతాన్ని పోలీసులు పూర్తిగా సీజ్ చేశారు. ఘటనా స్థలం నుండి తప్పించుకున్న ఇతర ఉగ్రవాదులను పట్టుకోవడానికి పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. పౌరుల హత్యలను దృష్టిలో ఉంచుకుని భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్న సమయంలో పోలీసు బృందంపై దాడి జరిగింది.

ఏడాది పాటు కనిపించకుండా పోయి తీవ్రవాదిగా తేలాడు..

ఎన్‌కౌంటర్ లో మరణించిన ఆఖిబ్‌ను అతని సోదరుడు ఇష్ఫాక్ గుర్తించాడు. 24 ఏళ్ల ఆఖిబ్‌ దాదాపు ఏడాదిగా కనిపించకుండా పోయాడని ఆయన చెప్పారు. చివరిసారిగా అతను 12 నవంబర్ 2020 న కనిపించాడు. అతని కుటుంబం ఇమామ్ సాహిబ్ షోపియాన్ వద్ద అతను తప్పిపోయినట్లు కంప్లైంట్ చేశారు.

సాధారణ పౌరులపై ఉగ్రదాదులు..

సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు గత వారం రోజుల్లో కశ్మీర్‌లో 5 మంది సాధారణ వ్యక్తులను చంపారు. వీరిలో శ్రీనగర్‌లోని కాశ్మీర్ పండిట్ డ్రగ్ డీలర్, కాశ్మీరీ పండిట్ టీచర్, సిక్కు వర్గానికి చెందిన మహిళా ప్రిన్సిపాల్, బీహార్‌కు చెందిన వీధి విక్రేత, బండిపోరా నివాసి ఉన్నారు. ఇది లోయలోని సిక్కులు, కాశ్మీరీ పండిట్లలో భయానక వాతావరణాన్ని సృష్టించింది.

పాఠశాల దాడి తర్వాత  కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కాశ్మీర్‌లో సాధారణ ప్రజలను లక్ష్యంగా చేసుకుని, పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులను చంపిన తర్వాత హోం మంత్రి అమిత్ షా దాదాపు మూడు గంటల పాటు తన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఇందులో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, హోం సెక్రటరీ అజయ్ భల్లా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ అరవింద్ కుమార్, BSF డైరెక్టర్ జనరల్ పంకజ్ సింగ్, CRPF చీఫ్ కుల్దీప్ సింగ్ మరియు హోం మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రతీకార చర్యల కోసం రోడ్‌మ్యాప్ సమావేశంలో చర్చించబడింది.

ఇవి కూడా చదవండి: CM Dance: స్టెప్పులేసిన ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌.. వీడియో వైరల్

Huzurabad – Badvel: తెలంగాణ హుజురాబాద్‌.. ఆంధ్ర బద్వేల్‌ బైపోల్‌ వార్‌లో నమోదైన నామినేషన్ల చిట్టా ఇదీ..