ప్రియాంక అధ్యక్ష పదవి చేపట్టాలి: లాల్ బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి

| Edited By:

Jul 20, 2019 | 3:01 AM

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తులే పార్టీకి అధ్యక్షులుగా కొనసాగాలని పట్టుబట్టారు. అయితే సీనియర్లు మాత్రం ఈ విషయంలో ససేమిరా అంటున్నారు. రాహుల్ మాటతో వారు ఏకీభవించడం లేదు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని […]

ప్రియాంక అధ్యక్ష పదవి చేపట్టాలి:  లాల్ బహదూర్ శాస్త్రి తనయుడు అనిల్ శాస్త్రి
Follow us on

రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన తర్వాత పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ఘోర ఓటమి తర్వాత రాహుల్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గాంధీ కుటుంబం నుంచి కాకుండా బయటి వ్యక్తులే పార్టీకి అధ్యక్షులుగా కొనసాగాలని పట్టుబట్టారు. అయితే సీనియర్లు మాత్రం ఈ విషయంలో ససేమిరా అంటున్నారు. రాహుల్ మాటతో వారు ఏకీభవించడం లేదు. ఈ పరిస్థితిలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి కుమారుడు అనిల్ శాస్త్రి ఓ అడుగు ముందుకేసి .. పార్టీ అధ్యక్షురాలిగా ప్రియాంక గాంధీ అయితే బాగుంటుందని వాదించారు.

ప్రియాంక సేవలు పార్టీకి ఎంతో అవసరమని, పార్టీని మునుపటి స్థాయికి తీసుకురాగలరే నమ్మకం తనకుందని శాస్త్రి చెప్పుకొచ్చారు. పార్టీ సీనియర్లంతా అంగీకరించే బలమైన నాయకత్వం ప్రస్తుతం పార్టీకి అవసరమని, అలాంటి వ్యక్తి ప్రియాంక గాంధీ మాత్రమేనని తాను విశ్వసిస్తున్నట్టుగా శాస్త్రి చెప్పారు. జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రియాంక నూటికి నూరుశాతం న్యాయం చేస్తారని పార్టీలోని సీనియర్లు కూడా బలంగా నమ్ముతున్నామని ఆయన తెలిపారు.