Kerala Minister KT Jaleel: కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ కేటీ జలీల్ రాజీనామా… కారణం అదేనా..?

|

Apr 13, 2021 | 3:21 PM

కేరళ ప్రభుత్వంలో కుదుపు మొదలైంది. ఆ రాష్ట్ర ఉన్నత విద్య, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కేటీ జలీల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు.

Kerala Minister KT Jaleel: కేరళ ఉన్నత విద్యా శాఖ మంత్రి డాక్టర్ కేటీ జలీల్ రాజీనామా...  కారణం అదేనా..?
Kerala Minister Kt Jaleel Submits Resignation Over Lokayukta Report Of Nepotism
Follow us on

Kerala Minister KT Jaleel Resigns:  కేరళ ప్రభుత్వంలో కుదుపు మొదలైంది. ఆ రాష్ట్ర ఉన్నత విద్య, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ కేటీ జలీల్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు సమర్పించారు. కేరళ లోకాయుక్త అధికార దుర్వినియోగం, పక్షపాతం, స్వపక్షపాతం, ప్రమాణ స్వీకారం ఉల్లంఘన ఆరోపణలు మంత్రిపై రుజువు కావడంతో ఆయన రాజీనామా చేసినట్లు సమాచారం.

కేరళ రాష్ట్ర మైనారిటీ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్‌లో మంత్రి బంధువు నియామకానికి సంబంధించి లోకాయుక్తలో కేసు నమోదైంది. మంత్రి జలీల్‌పై ఆరోపణలు రుజువు కావడంతో తగిన చర్యల కోసం లోకాయుక్త కేరళ సిఎంకు నివేదిక సమర్పించారు. కేటీ జలీల్‌పై ఇలాంటి ఆరోపణలు రుజువు కావడంతో, మంత్రుల మండలి సభ్యుడిగా ఆయన నిర్వహించిన పదవిని కొనసాగించకూడదని లోకాయుక్త నివేదించింది. మరోవైపు, లోకాయుక్త నివేదిక నేపథ్యంలో జలీల్ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే క్రమంలో మంత్రి జలీల్ తన రాజీనామాను సమర్పించారు.


Read Also…. 

 హరిద్వార్ కుంభమేళకు పోటెత్తుతున్న జనాలు.. కొవిడ్‌ నిబంధనలు తుంగలోకి.. ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?

CM KCR Sagar Meeting: హాలియాలో సీఎం కేసీఆర్ సభకు తొలగిన అడ్డంకి.. పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు