Wayanad Landslides: జలవిలయం.. ఎటు చూసినా హృదయవిదారకం.. 344కి చేరిన మృతుల సంఖ్య..

|

Aug 03, 2024 | 11:39 AM

కేరళ.. జలవిలయం నుంచి ఇంకా కోలుకోలేదు.. వరద మృతుల సంఖ్య 344కి చేరింది. శిధిలాల కింద మరిన్ని మృతదేహాలు గుర్తించారు. వయనాడ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 300 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతోంది. కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

Wayanad Landslides: జలవిలయం.. ఎటు చూసినా హృదయవిదారకం.. 344కి చేరిన మృతుల సంఖ్య..
Wayanad Landslides
Follow us on

కేరళ.. జలవిలయం నుంచి ఇంకా కోలుకోలేదు.. వరద మృతుల సంఖ్య 344కి చేరింది. శిధిలాల కింద మరిన్ని మృతదేహాలు గుర్తించారు. వయనాడ్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. దాదాపు 300 మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతోంది. కొండచరియలు పడి విస్తరించిన మొత్తం ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. శునకాలతోపాటు స్థానికులు, అటవీశాఖ సిబ్బంది మొత్తం 40 బృందాలుగా ఏర్పడి గాలింపు ముమ్మరం చేశారు. కొండచరియల ప్రభావిత ప్రాంతాలను ఆరు జోన్లుగా విభజించారు. కొండచరియలు విరిగిపడటంతో ప్రజలు చిక్కుకుపోయిన లోతట్టు ప్రాంతాలకు చేరుకోవడానికి 140 మంది సైనికులు రికార్డు స్థాయిలో 31 గంటల్లో బెయిలీ బ్రిడ్జిని నిర్మించారు. భారీ వర్షాలతో హెలికాప్టర్లు సామాగ్రిని దించడం, కొట్టుకుపోయిన రోడ్లు, వంతెనలు, వరద బాధితులను ఐసోలేట్ చేయడం, క్లిష్టమైన భూభాగంతో సహాయక చర్యలు కష్టంగా మారాయి. డ్రోన్ వ్యూ చూస్తే చూరల్‌మల్‌లోని ప్రాంతమంతా నీట మునిగినట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు ఇరువాజింజీ నది ఉప్పొంగి దాని ఒడ్డున ఉన్న అన్ని ప్రాంతాలను ముంచెత్తింది

కాగా.. ముండక్కైలో కొట్టుకుపోయిన ఓ దుకాణం దగ్గర శిథిలాల కింద జీవం ఉండొచ్చని థర్మెల్‌ స్కానర్‌ అప్రమత్తం చేసింది. 3 మీటర్ల లోతులో, ఐదు గంటల పాటు వెతికినా మనిషి ఆనవాళ్లు దొరకలేదు. మరోవైపు, పశ్చిమ కనుమలలోని 56వేల 800 చదరపు కిలోమీటర్ల ప్రాంతం పర్యావరణపరంగా సున్నితమైనదని కేంద్రం ముసాయిదా నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వయనాడ్‌లో కొండచరియల విధ్వంసానికి గురైన 13 గ్రామాలు కూడా దీని పరిధిలో ఉన్నాయి.

కాగా.. కేరళలోని వయనాడ్ విపత్తు బాధితులకు కాంగ్రెస్ తరఫున వందకు పైగా ఇండ్లు కట్టించి ఆదుకుంటామని ఆ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. మిగిలిన విపత్తులతో దీన్ని పోల్చొద్దని కేంద్రాన్ని కోరుతానన్నారు. కేరళలో ఇంతటి భయానక విషాదాన్ని మునుపెన్నడూ చూడలేదని రాహుల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తాము ఎలాంటి సాయం చేసేందుకైనా వెనుకాడబోమని, ఇక్కడే ఉండి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తామని చెప్పారు. రెండ్రోజులుగా ప్రియాంకా గాంధీతో కలిసి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటిస్తున్నారు.

అయితే.. 2018లో 500 మందిని బలిగొన్న భారీ వరదల తర్వాత కేరళలో సంభవించిన అత్యంత ఘోరమైన ప్రకృతి విపత్తు ఇది. మృతుల సంఖ్య 338కు చేరుకుంది. ఇంకా 281 మంది ఆచూకీ దొరకడం లేదు. 250 మంది తీవ్రంగా గాయపడ్డారు. 350కి పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. కొండచరియల శిధిలాల కింద ఇంకా ఎన్ని మృతదేహాలున్నాయో తెలియని పరిస్థితి. వారం రోజులుగా వయనాడ్​లో వర్షం కురుస్తూనే ఉందని, సహాయక చర్యలకు ఆటంకాలు ఎదురవుతున్నాయని రెస్క్యూ సిబ్బంది చెప్తున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని గుర్తించేందుకు డాగ్ స్క్వాడ్, స్పెషల్ డ్రోన్లు, థర్మల్ స్కానర్లను అధికారులు ఉపయోగిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..