వాటర్ టాక్సీ.. టూరిస్ట్‌ల కోసం కేరళ వినూత్న ప్రయోగం

| Edited By:

Oct 19, 2020 | 4:15 PM

పర్యాటకులకు ఆకర్షించడంలో కేరళ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలి వాటర్ టాక్సీ సర్వీస్‌ని ప్రారంభించింది.

వాటర్ టాక్సీ.. టూరిస్ట్‌ల కోసం కేరళ వినూత్న ప్రయోగం
Follow us on

Water Taxi Kerala: పర్యాటకులకు ఆకర్షించడంలో కేరళ ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తొలి వాటర్ టాక్సీ సర్వీస్‌ని ప్రారంభించింది. అలప్పుజ బ్యాక్‌ వాటర్స్‌లో ఈ వాటర్ టాక్సీలను రాష్ట్ర వాటర్ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ ఆదివారం ప్రారంభించింది. దీని వలన నాణ్యమైన సేవలతో పాటు సమయం కూడా ఆదా అవ్వనుంది.

ఇక వాటర్ టాక్సీ విశేషాల్లోకి వెళ్తే.. 10 మంది ఒకేసారి ప్రయాణించొచ్చు. దాంతో పాటు పూల్‌గా ఏర్పడి కూడా బోటులో ప్రయాణం చేసుకోవచ్చు. కేటామరన్ డీజిల్ పవర్‌తో ఈ బోటు టాక్సీ నడుస్తుంది. నవగతి మెరైన్ డిజైన్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్‌ లిమిటెడ్‌ వీటిని నిర్మించింది. ఎలక్ట్రిక్‌ పవర్‌ స్టీరింగ్‌, సోలార్ ప్యానెల్‌ అమరికతో అన్ని విద్యుత్‌ అవసరాలకు తీర్చేలా దీన్ని తయారుచేశారు. గంటకు 35 కిలోమీటర్ల వేగంతో ఈ టాక్సీలు ప్రయాణిస్తాయి.

Read More:

మూడో భర్తను ఇంటి నుంచి గెంటేసిన నటి..!

నిత్య, రీతూల ‘నిన్నిలా నిన్నిలా’.. ఆకట్టుకుంటోన్న పోస్టర్‌