Covid-19: కోవిడ్ ఎఫెక్ట్..రాత్రిపూట కర్ఫ్యూపై కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం

|

Apr 16, 2021 | 12:54 PM

Karnataka Covid-19 News: కర్ణాటక రాజధాని బెంగుళూరు సహా మొత్తం ఏడు జిల్లాల్లో ఈ నెల 10 నుంచి అమలు చేస్తున్న రాత్రిపూట కర్ఫ్యూను ఈ నెల 20 వరకు కొనసాగించాలని నిర్ణయించారు. ప్రస్తుతం బెంగుళూరు, మైసూర్, మంగళూరు, కాలబుర్గి, బీదర్, టుమ్కూరు, ఉడిపి-మణిపాల్‌లో ఏప్రిల్ 10 నుంచి రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.

Covid-19: కోవిడ్ ఎఫెక్ట్..రాత్రిపూట కర్ఫ్యూపై కర్ణాటక సర్కారు కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
Follow us on

కర్ణాటకలో కరోనా విజృంభిస్తోంది. కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గురువారం ఒక్క రోజే ఆ రాష్ట్రంలో  14,738 కొత్త కేసులు నమోదుకాగా…66 మంది కరోనా కాటుకు బలయ్యారు. ఒక రోజున ఈ స్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. అంతకు ముందురోజు బుధవారం 11,265 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. కర్ణాటకలో గురువారంనాడు కొత్తగా నమోదైన 14,738 కేసుల్లో…10,497 కేసులు బెంగళూరు నగర పరిధిలోనే నమోదుకావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప శుక్రవారం ఉదయం తన నివాసంలో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు.

కర్ణాటక రాజధాని బెంగుళూరు సహా ఏడు జిల్లాల్లో ఈ నెల 10 నుంచి అమలు చేస్తున్న రాత్రిపూట కర్ఫ్యూను ఈ నెల 20 వరకు కొనసాగించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ప్రస్తుతం బెంగుళూరు, మైసూర్, మంగళూరు, కాలబుర్గి, బీదర్, టుమ్కూరు, ఉడిపి-మణిపాల్‌లో ఏప్రిల్ 10 నుంచి రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. ప్రతి రోజూ రాత్రి 10 గం.ల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గం.ల వరకు ఈ రాత్రిపూట కర్ఫ్యూను అమలు చేస్తున్నారు.

రాష్ట్రంలో కరోనా ఉధృతి నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సీఎం యడియూరప్ప తెలిపారు. రాష్ట్రంలోని పరిస్థితులు వేరని…ఇక్కడి పరిస్థితులను ఇతర రాష్ట్రాలతో పోల్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. కరోనా కట్టడికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

ఇవి కూడా చదవండి..మామిడి పండ్లు సహజంగా పండినవా..! కృత్రిమంగా పండించారా..! ఎలా గుర్తించాలో తెలుసుకోండి..?

రంజాన్‌ స్పెషల్‌ హలీమ్‌ తింటున్నారా..! అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి..?