నేనే సీఎం.. బల పరీక్ష నెగ్గిన యడియూరప్ప

| Edited By:

Jul 29, 2019 | 12:04 PM

కర్నాటక రాజకీయ సంక్షోభం ఇవాళ్టితో ముగిసింది. ఇవాళ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో యడియూరప్ప నెగ్గారు. మొదట 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ వేటు వేయడంతో.. యడియూరప్ప బలపరీక్షపై సస్పెన్స్ నెలకొంది. అయితే రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు పడడంతో యడియూరప్పకు ఫ్లోర్ టెస్ట్ గెలిచేందుకు లైన్ క్లియర్ అయినట్లైంది. మూజువాణి ఓటుతో ఆయన మోజారిటీని నిరూపించుకున్నారు.   అసెంబ్లీలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 114గా ఉండేది. అయితే రెబెల్ […]

నేనే సీఎం.. బల పరీక్ష నెగ్గిన యడియూరప్ప
Follow us on

కర్నాటక రాజకీయ సంక్షోభం ఇవాళ్టితో ముగిసింది. ఇవాళ అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో యడియూరప్ప నెగ్గారు. మొదట 17 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ వేటు వేయడంతో.. యడియూరప్ప బలపరీక్షపై సస్పెన్స్ నెలకొంది. అయితే రెబెల్ ఎమ్మెల్యేలపై వేటు పడడంతో యడియూరప్పకు ఫ్లోర్ టెస్ట్ గెలిచేందుకు లైన్ క్లియర్ అయినట్లైంది. మూజువాణి ఓటుతో ఆయన మోజారిటీని నిరూపించుకున్నారు.

 

అసెంబ్లీలో మొత్తం 224 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 114గా ఉండేది. అయితే రెబెల్ ఎమ్మెల్యేలపై వేటుపడటంతో.. మ్యాజిక్ ఫిగర్ చేంజ్ అయ్యింది. అది కాస్త 104కు చేరడంతో.. యడియూరప్ప విజయం లాంచనమయ్యింది. బీజేపీకి సొంతంగా 105 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో బలపరీక్షను యడియూరప్ప సునాయాసంగా నెగ్గారు. విశ్వాస పరీక్షకు 104 మంది ఎమ్మెల్యేల ఓట్లు కావాల్సి ఉండగా.. 106 మంది మద్దతుగా నిలిచారు.