Jyotiraditya Scindia: ఇండియా కూటమి నేతల మనస్తత్వం దిగజారింది.. రాహుల్ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా ఫైర్..

|

Aug 20, 2024 | 9:07 PM

కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తంచేశారు. కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు విషయంలో.. రాహుల్‌ గాంధీ మాట్లాడిన తీరుపై జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు..

Jyotiraditya Scindia: ఇండియా కూటమి నేతల మనస్తత్వం దిగజారింది.. రాహుల్ వ్యాఖ్యలపై జ్యోతిరాదిత్య సింధియా ఫైర్..
Jyotiraditya Scindia on Rahul Gandhi
Follow us on

కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఆగ్రహం వ్యక్తంచేశారు. కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య కేసు విషయంలో.. రాహుల్‌ గాంధీ మాట్లాడిన తీరుపై జ్యోతిరాదిత్య సింధియా స్పందించారు.. ఈ రోజు ఇండియా అలయన్స్.. దాని నాయకుల మనస్తత్వం ఎంతగా దిగజారింది.. దేశ కుమార్తె జీవితం వారికి పరధ్యానంగా మారిందంటూ పేర్కొన్నారు. ఈ మేరకు జ్యోతిరాదిత్య సింధియా మంగళవారం సాయంత్రం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో రాహుల్ గాంధీకి సంబంధించిన చిన్న వీడియో క్లిప్‌ను పంచుకున్నారు. ఈ వీడియోలో కోల్‌కతా రేప్ కేసుపై సుప్రీంకోర్టు విచారణపై జర్నలిస్టులు రాహుల్‌ గాంధీని ప్రశ్నించారు. దీనిపై రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “నేను ఈ విషయంలో ఇక్కడకు వచ్చాను. అవును, మీరు ఈ సమస్యను లేవనెత్తకూడదని, మీరు దృష్టి మరల్చాలనుకుంటున్నారని నాకు తెలుసు..’’ అంటూ పేర్కొన్నారు.. అయితే.. ఈ ప్రకటన ఆధారంగా సింధియా రాహుల్ పై విరుచుకుపడ్డారు.

ఈ మేరకు జ్యోతిరాదిత్య సింధియా ఇలా వ్రాశారు.. “ఇండియా కూటమి.. దాని సీనియర్ నాయకుల మనస్తత్వం నేడు మరింత దిగజారిపోయింది.. దేశ కుమార్తె జీవితం వారికి కేవలం పరధ్యానం మాత్రమే. ప్రతిపక్ష నాయకుడి ఈ ప్రకటన చాలా ఖండించదగినది.. మహిళా వ్యతిరేకం..’’ అంటూ పేర్కొన్నారు.

దీంతోపాటు సింధియా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హయాంలో ఏళ్ల తరబడి మహిళలపై జరుగుతున్న అణచివేత దృశ్యం.. దేశం మొత్తం ముందు ఉందని తెలిపారు. ఇండి కూటమి సంకీర్ణ ప్రభుత్వం ఎక్కడ ఉంటే అక్కడ మహిళల గౌరవం, మానప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఇటీవల కోల్‌కతాలో జరిగిన సంఘటన ద్వారా స్పష్టమవుతోందని తెలిపారు..

సింధియా ట్వీట్..

రాహుల్ గాంధీ నినాదం.. ‘మొహబ్బత్ కి దుకాన్’.. ను ప్రస్తావించిన కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. భయం – హింస వస్తువులను విక్రయించే వారిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు. నేడు దేశం మొత్తం బాధిత కుటుంబానికి అండగా నిలుస్తోంది.. అంటూ ట్విట్ లో పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..