National Testing Agency: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

|

Feb 12, 2021 | 11:05 AM

National Testing Agency: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టీఏ) కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన విద్యావేత్తల నుంచి దరఖాస్తులను ...

National Testing Agency: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం
Follow us on

National Testing Agency: భారత ప్రభుత్వ విద్యామంత్రిత్వశాఖకు చెందిన నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టీఏ) కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన విద్యావేత్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. వీటిలో జాయింట్‌ డైరెక్టర్‌, డిప్యూటీ డైరెక్టర్‌, అసిస్టెంట్‌ డైరెక్టర్‌, సీనియర్‌ ప్రోగ్రామర్‌, ప్రోగ్రామర్‌, సీనియర్‌ సూపరింటెండెంట్‌, స్టెనో గ్రాఫర్‌, సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌,సీనియర్‌ టెక్నీషియన్‌, జూనియర్‌ టెక్నీషియన్‌ రిసెర్చ్ సైంటిస్ట్‌ తదితర పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఫిబ్రవరి 18. పూర్తి వివరాలకు https://nta.ac.in/ వెబ్‌సైట్‌ సంప్రదించాలని కోరింది.

మొత్తం ఖాళీలు: 40- పోస్టులు

జాయింట్ డైరెక్ట‌ర్‌, డిప్యూటీ డైరెక్ట‌ర్‌, అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌, సీనియ‌ర్ ప్రోగ్రామ‌ర్‌, ప్రోగ్రామ‌ర్‌, సీనియ‌ర్ సూప‌రింటెండెంట్‌, స్టెనోగ్రాఫ‌ర్, సీనియ‌ర్ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌, జూనియ‌ర్ అసిస్టెంట్‌, సీనియ‌ర్ టెక్నీషియ‌న్‌, జూనియ‌ర్ టెక్నీషియ‌న్‌, రిసెర్చ్ సైంటిస్ట్‌ తదితర పోస్టులున్నాయి.

అర్హత :

సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత పనిపై అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం :

కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పోస్టులకు రాత పరీక్ష, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు గాను రాత పరీక్షలు 70 మార్కులు, పర్సనల్‌ ఇంటర్వ్యూ కమ్‌ సూటబిలిటీ టెస్టుకు 30 మార్కులు కేటాయించారు. షార్ట్‌లిస్ట్‌ అయిన అభ్యర్థుల వివరాలు, పరీక్షకు సంబంధించి సిలబస్‌ వివరాలు సంబంధిత వెబ్‌సైట్‌లో చూడవచ్చు. ఈ దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారానే చేసుకోవాల్సి ఉంటుందని తెలిపింది.

Also Read:

IOCL Recruitment 2021: ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌