Jammu and Kashmir: ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి.. ముగ్గురు జవాన్ల వీరమరణం..

|

Aug 11, 2022 | 9:44 AM

రాజౌరి సెక్టార్‌లోని ఆర్మీ కంపెనీ స్థావరంపై ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని.. ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

Jammu and Kashmir: ఆర్మీ క్యాంప్‌పై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి.. ముగ్గురు జవాన్ల వీరమరణం..
Army
Follow us on

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఆర్మీ స్థావరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందారు. ఈ ఘటన రాజౌరికి 25 కిలోమీటర్ల దూరంలోని దర్హల్ ప్రాంతం పర్గల్‌లో ఉన్న సైనిక శిబిరమే లక్ష్యంగా దాడి జరిగింది. రాజౌరి సెక్టార్‌లోని ఆర్మీ  స్థావరంపై ఇద్దరు ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని.. ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోందని భద్రతా అధికారులు తెలిపారు. తీవ్రవాద దాడిలో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సిబ్బందిలో ఒక అధికారి కూడా ఉన్నారు. వారందరినీ వైద్య చికిత్స కోసం తరలించారు. 16 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు.

దాడి అనంతరం అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..