కుప్వారాలో భారీగా పట్టుబడ్డ ఆయుధాలు.. అంతేకాదు..

| Edited By:

Jul 26, 2020 | 11:56 PM

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని సద్నా టాప్‌ చెక్ పోస్ట్ వద్ద ఆర్మీ,రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో వాహనాలను..

కుప్వారాలో భారీగా పట్టుబడ్డ ఆయుధాలు.. అంతేకాదు..
Follow us on

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారాలో భారీగా ఆయుధాలు పట్టుబడ్డాయి. జిల్లాలోని సద్నా టాప్‌ చెక్ పోస్ట్ వద్ద ఆర్మీ,రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులు సంయుక్తంగా సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో వాహనాలను తనిఖీలు చేస్తుండగా.. ఓ ట్రక్కులో పెద్ద ఎత్తున ఆయుధాలు ఉండటాన్ని గుర్తించారు. అంతేకాదు.. నిషేధిత డ్రగ్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. హజీ నగర్‌ ప్రాంతానికి చెందిన ఉమర్ షేక్‌ అనే వ్యక్తి ఈ ఆయుధాలను, డ్రగ్స్‌ను వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి.. ఉమర్ షేక్‌ను అదుపులోకి తీసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో.. రెండు ఏకే-56 రైఫిల్స్‌తో పాటు.. రెండు మ్యాగజైన్లు ఉన్నాయి. అంతేకాదు.. మరో రెండు పిస్టల్స్‌తో పాటు నాలుగు మ్యాగజైన్లు, 76 రౌండ్ల రైఫిల్ మందుగుండు సామాగ్రి, 90 పిస్టల్స్‌ మ్యాగజైన్లు ఉన్నాయి. మరికొన్ని హ్యాండ్‌ గ్రేనేడ్లు కూడా ఉన్నాయి. అందులో కొన్నింటిపై చైనీస్‌కు సంబంధించిన ఆనవాళ్లు కూడా కన్పించాయి. ఇక పది కిలోల డ్రగ్స్‌ ప్యాకెట్లు కూడా ఉన్నాయి. డ్రగ్స్‌ దందాతో వచ్చే డబ్బును ఉగ్రవాదులు వారి ఖర్చులకు ఉపయోగిస్తున్నారు.