వారెవ్వా.. మైనస్ 20 డిగ్రీల మంచులో జవాన్ల జెండా వందనం

| Edited By:

Jan 26, 2020 | 2:27 PM

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌లో 17 వేల అడుగుల ఎత్తున మంచుకొండలపై ఐటీబీపీ సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించారు. ‘భరత్ మాతా కి జై’, ‘వందే మాతరం’ అంటూ ఆ మంచు కొండలను ఎక్కి.. ఇండియా-టిబెటన్ బోర్డర్‌లో హిమ పర్వత అంచుల్లో జాతీయ జెండాను ఎగురవేసి.. వారి దేశ భక్తిని చాటుకున్నారు సైనికులు. సాధారణంగా చలిలోనే ఉండటం కష్టం.. అలాంటి ఎముకలను కొరికే చలిలో.. మంచుకొండలపై దాదాపు అరగంటపాటు జాతీయగీతాన్ని […]

వారెవ్వా.. మైనస్ 20 డిగ్రీల మంచులో జవాన్ల జెండా వందనం
Follow us on

దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా జమ్మూకాశ్మీర్‌లోని లడఖ్‌లో 17 వేల అడుగుల ఎత్తున మంచుకొండలపై ఐటీబీపీ సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించారు. ‘భరత్ మాతా కి జై’, ‘వందే మాతరం’ అంటూ ఆ మంచు కొండలను ఎక్కి.. ఇండియా-టిబెటన్ బోర్డర్‌లో హిమ పర్వత అంచుల్లో జాతీయ జెండాను ఎగురవేసి.. వారి దేశ భక్తిని చాటుకున్నారు సైనికులు.

సాధారణంగా చలిలోనే ఉండటం కష్టం.. అలాంటి ఎముకలను కొరికే చలిలో.. మంచుకొండలపై దాదాపు అరగంటపాటు జాతీయగీతాన్ని ఆలపించి, ప్రత్యేక విన్యాసాలు చేసి, జవాన్లు జెండా వందనం చేశారు. అనంతరం యుద్ధరంగంలో అమరులైన జవాన్లకు నివాళులు అర్పించారు. ప్రస్తుతం లడఖ్‌లో మైనస్ 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ దృశ్యాలు యావత్ భారతదేశ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.