రివాల్వర్‌తో కాల్పుకున్న ఐటీబీపీ జవాన్

| Edited By:

Aug 10, 2020 | 4:35 AM

హిమాచల్‌ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఇండో టిబేట్‌ బెటాలియన్‌కు చెందిన జవాన్‌ తన తగ్గర ఉన్న తుపాకీతో కాల్చుకున్నాడు. సిమ్లా జిల్లాలోని జియోరీ ప్రాంతంలో ఐటీబీపీ 43వ బెటాలియన్‌కు చెందిన..

రివాల్వర్‌తో కాల్పుకున్న ఐటీబీపీ జవాన్
Follow us on

హిమాచల్‌ ప్రదేశ్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఇండో టిబేట్‌ బెటాలియన్‌కు చెందిన జవాన్‌ తన తగ్గర ఉన్న తుపాకీతో కాల్చుకున్నాడు. సిమ్లా జిల్లాలోని జియోరీ ప్రాంతంలో ఐటీబీపీ 43వ బెటాలియన్‌కు చెందిన జవాన్‌ ఈ ఘటనకు పాల్పడ్డాడు. ఆదివారం తెల్లవారు జామున ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే సహచర జవాన్లు ఈ విషయాన్ని గమనించి వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం.. సిమ్లాలోని ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీలో చేర్చారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సిమ్లా సూపరింటెండెంట్ ఆఫ్‌ పోలీస్‌ చెప్పారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ జవాన్‌పై ఐపీసీ, ఆయుధ చట్టంలోని సెక్షన్ 337,337,309 కింద స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

కాగా, బాధిత జవాన్‌ మహారాష్ట్రకు చెందిన 31 ఏళ్ల సచిన్‌ యాదవ్‌గా గుర్తించారు. ఇటీవలే సెలవులపై ఇంటికి వెళ్లి వచ్చి.. తిరిగి విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే వారం రోజులు కూడా గడవక ముందే ఈ ఘటనకు పాల్పడ్డాడు.

Read More :

కర్ణాటక ఆరోగ్య మంత్రి శ్రీరాములుకు కరోనా

మహారాష్ట్రలో విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి

తమిళనాడులో 3 లక్షలకు చేరువలో పాజిటివ్‌ కేసులు