ISRO: ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగం.. ఇస్రో శాస్త్రవేత్తల ప్రత్యేక పూజలు..

|

Aug 15, 2024 | 6:22 PM

రేపే నింగిలోకి దూసుకుని వెళ్లనుంది. చిన్నచిన్న శాటిలైట్లను నింగిలోకి పంపేందుకు ఉద్దేశించిన స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్...SSLVDను మూడోసారి ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలో రేపటి ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది.

ISRO: ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగం.. ఇస్రో శాస్త్రవేత్తల ప్రత్యేక పూజలు..
Isro
Follow us on

రేపే నింగిలోకి దూసుకుని వెళ్లనుంది. చిన్నచిన్న శాటిలైట్లను నింగిలోకి పంపేందుకు ఉద్దేశించిన స్మాల్ సాటిలైట్ లాంచ్ వెహికల్…SSLVDను మూడోసారి ప్రయోగించేందుకు ఇస్రో సిద్ధమైంది. శ్రీహరికోటలో రేపటి ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. రేపు ఉదయం 9:17కి SSLV-D3 రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీని ద్వారా EOS-08 ఉపగ్రహాన్ని రోదసిలో ప్రవేశపెడతారు. ఈ మిషన్‌ టార్గెట్‌.. భూ పరిశీలన. మిషన్‌ రెడీనెస్‌ రివ్యూ- MRRలో అన్నీ చెక్ చేసుకున్న శాస్త్రవేత్తలు నిర్దిష్ట సమయానికే ప్రయోగం ప్రారంభమవుతుందంటున్నారు. షార్‌లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగానికి కౌంట్‌డౌన్‌ మొదలైంది. SSLV-D3 ప్రయోగాన్ని ఇవాళే చేపట్టాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో రేపటికి వాయిదా వేశారు.

ఇక తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు ఇస్రో సైంటిస్టులు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అర్చకుల ఆశీర్వచనం పొందారు. రేపు సతీశ్‌ ధావన్‌ సెంటర్‌ నుంచి జరిగే SSLV D3 రాకెట్‌ ప్రయోగం సక్సెస్‌ కావాలని కోరుకున్నారు. ఈ రాకెట్‌ను ఇండియన్‌ ఇండస్ట్రీ, NSIL సంయుక్తంగా ప్రయోగిస్తోంది. రాకెట్‌ ప్రయోగాన్ని చూసేందుకు సాధారణ పౌరులకు సైతం అవకాశం కల్పించారు. ప్రయోగాన్ని చూసేవారు ముందస్తుగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి