ఏడాదిన్నర అజ్ఞాతం.. ఒక్క చిన్న తప్పు.. ఇంటర్‌పోల్ వలలో దావూద్ ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు!

అంతర్జాతీయ మాదకద్రవ్యాల ప్రపంచంలో అతడొక అదృశ్య శక్తి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు, 'డి-కంపెనీ' డ్రగ్ నెట్‌వర్క్‌కు కీలక సూత్రధారి. అతడే మహమ్మద్ సలీం డోలా. దశాబ్ద కాలంగా భారత దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ స్మగ్లర్, చివరకు ఒక చిన్న పొరపాటుతో ఇస్తాంబుల్ నడిబొడ్డున చిక్కాడు.

ఏడాదిన్నర అజ్ఞాతం.. ఒక్క చిన్న తప్పు.. ఇంటర్‌పోల్ వలలో దావూద్ ఇబ్రహీం అత్యంత సన్నిహితుడు!
Salim Dola Arrested

Updated on: May 02, 2026 | 9:28 AM

అంతర్జాతీయ మాదకద్రవ్యాల ప్రపంచంలో అతడొక అదృశ్య శక్తి. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహితుడు, ‘డి-కంపెనీ’ డ్రగ్ నెట్‌వర్క్‌కు కీలక సూత్రధారి. అతడే మహమ్మద్ సలీం డోలా. దశాబ్ద కాలంగా భారత దర్యాప్తు సంస్థల కళ్లుగప్పి తిరుగుతున్న ఈ స్మగ్లర్, చివరకు ఒక చిన్న పొరపాటుతో ఇస్తాంబుల్ నడిబొడ్డున చిక్కాడు. ఇటీవల టర్కీ ప్రభుత్వం అతడిని భారతదేశానికి అప్పగించడంతో ఈ ఉత్కంఠభరిత ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది.

భారత దర్యాప్తు సంస్థలు, ఇంటర్‌పోల్ తన కోసం వేట మొదలుపెట్టాయని తెలిసినప్పటి నుండి, సలీం డోలా టర్కీలో తలదాచుకున్నాడు. పట్టుబడతామనే భయంతో ఏకంగా ఏడాదిన్నర పాటు తన గది నుండి బయటకు అడుగు పెట్టలేదు. బల్గేరియన్ పాస్‌పోర్ట్‌పై హమ్జా అనే నకిలీ పేరుతో చలామణీ అవుతూ, బయటి ప్రపంచంతో అన్ని సంబంధాలను తెంచుకున్నాడు. తన రహస్య స్థావరం చిరునామా ఎవరికీ తెలియకూడదని కఠినమైన నిబంధనలు పాటించాడు.

ఎంతటి నేరగాడైనా ఏదో ఒక సమయంలో అజాగ్రత్తగా ఉంటాడనే దానికి సలీం డోలానే ఉదాహరణ. ఏ గాలి పడకుండా రహస్యంగా జీవిస్తున్న డోలా, ఇటీవలే తన నివాసానికి ఒక కొరియర్‌ను ఆర్డర్ చేశాడు. ఈ చిన్న సమాచారమే భారత దర్యాప్తు సంస్థలకు అతిపెద్ద క్లూగా మారింది. ఇంటర్‌పోల్ సహకారంతో ఆ కొరియర్ అడ్రస్‌ను ట్రాక్ చేసిన భారత అధికారులు, వెంటనే ఇస్తాంబుల్ పోలీసులను అప్రమత్తం చేశారు. పోలీసులు మెరుపు దాడి చేయగా, ఆ గదిలో హమ్జా పేరుతో ఉన్న బల్గేరియన్ పాస్‌పోర్ట్‌తో పాటు రెండు భారతీయ పాస్‌పోర్ట్‌లు లభించాయి. దీంతో అతడు సలీం డోలా అని నిర్ధారణ అయ్యింది.

టర్కీతో భారతదేశానికి నేరస్తుల అప్పగింత ఒప్పందం లేనప్పటికీ, భారత విదేశాంగ శాఖ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ‘ఆపరేషన్ గ్లోబల్ హంట్’ పేరుతో నిర్వహించిన ఈ మిషన్‌లో దౌత్యపరమైన ఒత్తిడిని ఉపయోగించి డోలాను భారత్‌కు తీసుకురావడంలో విజయం సాధించారు.

సలీం డోలా నెట్‌వర్క్ ఆసియా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో విస్తరించి ఉంది. ముఖ్యంగా MDMA వంటి సింథటిక్ డ్రగ్స్‌ను రిమోట్‌గా పంపిణీ చేయడంలో ఇతడు సిద్ధహస్తుడు. ఇతని కుమారుడు తాహిర్ డోలాను ఇప్పటికే 2025లో యూఏఈ నుండి అప్పగించగా, ఇప్పుడు సలీం అరెస్టుతో డి-కంపెనీ డ్రగ్ సిండికేట్ వెన్నుపూస విరిగినట్లయింది. గడ్డివాములో సూదిని వెతికినంత కష్టంగా సాగిన ఈ ఆపరేషన్, చివరకు భారత ఏజెన్సీల పట్టుదలకు నిదర్శనంగా నిలిచింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us