AIR: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రేడియో స్టేషన్‌లో ప్రారంభమైన హై పవర్ ట్రాన్స్‌మిటర్‌లు

| Edited By: Ravi Kiran

Sep 25, 2021 | 1:25 PM

కార్గిల్‌లోని హంబింటింగ్లాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న రేడియో స్టేషన్‌లో కేంద్ర విద్యుత్, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ హై పవర్ ట్రాన్స్‌మిటర్‌లను ప్రారంభించారు.

AIR: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రేడియో స్టేషన్‌లో ప్రారంభమైన హై పవర్ ట్రాన్స్‌మిటర్‌లు
Anurag Thakur
Follow us on

AIR: కార్గిల్‌లోని హంబింటింగ్లాలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉన్న రేడియో స్టేషన్‌లో కేంద్ర విద్యుత్, ప్రసార మంత్రి అనురాగ్ ఠాకూర్ హై పవర్ ట్రాన్స్‌మిటర్‌లను ప్రారంభించారు. వీటి ద్వారా ఎత్తయిన ప్రదేశాల్లో రేడియో అలాగే దూరదర్శన్ ప్రసారాలు మెరుగవుతాయి. ఆల్ ఇండియా రేడియో కరస్పాండెంట్ నివేదిక ప్రకారం..సగటు సముద్ర మట్టం నుండి 13 వేల 300 అడుగుల ఎత్తులో, ప్రతి 10kW హై పవర్ ట్రాన్స్‌మిటర్లు ప్రత్యేకించి కార్గిల్, బతాలిక్ సెక్టార్లలో ఆల్ ఇండియా రేడియో, FM రేడియో స్టేషన్, దూరదర్శన్ ప్రసారాలను.. వాటి రీచ్‌ని మెరుగుపరుస్తాయి. అత్యధిక ఎలివేటెడ్ ట్రాన్స్‌మిటర్‌ల ప్రారంభోత్సవంతో, పర్వత ప్రాంతంలోని ప్రజలు AIR అదేవిధంగా దూరదర్శన్ మెరుగైన నాణ్యమైన సేవలను పొందుతారు. ప్రజలకు, ప్రత్యేకించి లడఖ్‌లోని సరిహద్దు గ్రామాలకు సమాచారాన్ని చేరువ చేయడానికి ప్రభుత్వ ప్రయత్నాలలో భాగంగా కొత్త ట్రాన్స్‌మిటర్లు ఏర్పాటు జరుగుతోంది.

పార్లమెంటు సభ్యుడు జమ్యాంగ్ ట్సెరింగ్ నామ్‌గ్యాల్, లడఖ్ అటానమస్ హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిల్, లేహ్ సిఇసి తాషి గెయాల్ట్సన్, ఐ అండ్ బి మంత్రి అనురాగ్ ఠాకూర్ లతో పాటు డిడి కాశ్మీర్ డిటిహెచ్ ప్లాట్‌ఫామ్ నుండి లడఖి న్యూస్.. ప్రోగ్రామ్‌ల ప్రసారాన్ని అక్టోబర్ లో రెట్టింపు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా, అనురాగ్ ఠాకూర్ కూడా లడఖ్ ప్రాంతంలోని ప్రతి మూలకు చేరుకోవడానికి ఆల్ ఇండియా రేడియో ట్రాన్స్‌మిషన్ సేవలను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ హామీల అమలులో భాగంగా హై పవర్ ట్రాన్స్‌మిటర్‌లను ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి: 

Direct Taxes: కోవిడ్ కాలంలోనూ పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. గత సంవత్సరంతో పోలిస్తే భారీ పెరుగుదల..

Offers on Bank Deposits: ఈ బ్యాంకుల ప్రత్యేక ఆఫర్లు నెలాఖరుతో ముగుస్తాయి.. వీటిమీద ఓ లుక్కేయండి!