పేద బాలుడి ‘ఖాకీ’ కోరిక.. టీచర్‌లా మారిన పోలీస్‌

| Edited By:

Jul 27, 2020 | 3:13 PM

కరోనా వేళ పోలీసులు చేస్తున్న సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు.

పేద బాలుడి ఖాకీ కోరిక.. టీచర్‌లా మారిన పోలీస్‌
Follow us on

Police Turns Teacher for Young Boy: కరోనా వేళ పోలీసులు చేస్తున్న సేవలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఈ క్రమంలో ఎంతో మంది ప్రాణాలను సైతం వదిలారు. ఇదంతా చూసో.. లేక పోలీస్ ఉద్యోగంపై గౌరవమో ఏమో తెలీదు గానీ.. ఒక చిన్న పిల్లాడికి పోలీస్ శాఖలో చేరాలన్న కోరిక పెరిగిపోయింది. ఇదే విషయాన్ని ఓ పోలీస్ అధికారి దగ్గర బహిర్గతపరిచాడు. ఇక ఆ బాలుడి పరిస్థితి తెలుసుకున్న ఆ అధికారి టీచర్‌లా మారిపోయాడు. రోజూ తన విధులు పూర్తైన తరువాత ఆ అబ్బాయికి గణితం, ఇంగ్లీష్‌ పాఠాలను చెబుతున్నారు. ఇండోర్‌లోని పలాసియాలో విధులు నిర్వహిస్తోన్న వినోద్ దీక్షిత్‌ అనే పోలీస్‌ ఓ బాలుడికి నెల రోజులుగా ట్యూషన్ చెబుతున్నారు.

”పెట్రోలింగ్ చేస్తున్న సమయంలో రాజ్‌(బాలుడి పేరు) నన్ను కలిశాడు. నాకు పోలీస్ అవ్వాలనుంది. కానీ ట్యూషన్‌లకు వెళ్లేంత స్తోమత లేదు అని చెప్పాడు. నేను చదువు చెబుతా నేర్చుకుంటావా అని అడిగా. అందుకు ఆ అబ్బాయి చాలా సంతోషం వ్యక్తం చేశాడు. అతడికి ఇంగ్లీష్, గణితం పాఠాలు చెబుతున్నా. రాజ్‌ చాలా తెలివైన అబ్బాయి” అని చెప్పుకొచ్చారు. ఇక రాజ్ బీద కుటుంబానికి చెందిన వాడని.. అతడి తండ్రి టిఫెన్ సెంటర్‌ని నడుపుతుండగా.. తాత రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతున్నారని దీక్షిత్ తెలిపారు. మరోవైపు రాజ్ మాట్లాడుతూ.. ”అంకుల్ నాకు చాలా బాగా చెబుతున్నారు. ప్రతి రోజు ఆయన దగ్గరికి నేను ట్యూషన్‌కి వెళుతుంటా. నా హోమ్‌ వర్క్ చేస్తుంటా. పోలీస్ అవ్వాలన్నదే నా ధ్యేయం. అందుకే బాగా చదువుకోవాలనుకుంటున్నా” అని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలిసిన పలువురు పోలీస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read This Story Also: అయోధ్య రామాలయ నిర్మాణానికి మొఘల్ వారసుడి కానుక