Railway Job: 10 నెలల చిన్నారికి రైల్వే జాబ్‌! అరుదైన సంఘటన..

|

Jul 07, 2022 | 1:53 PM

ఈ రోజుల్లో ఉద్యోగ సంపాదన అంత సులువైన పనికాదు. అందునా ప్రభుత్వ ఉద్యోగమంటే తలకిందులుగా తపస్సు చేయవల్సిందే. కఠోర శ్రమతో.. రాత్రింబగళ్లు కష్టపడి చదివితే తప్ప ఉద్యోగం వరించదు. అలాంటిది ఓ 10 నెలల చిన్నారికి ఏకంగా రైల్వే ఉద్యోగం లభించింది..

Railway Job: 10 నెలల చిన్నారికి రైల్వే జాబ్‌! అరుదైన సంఘటన..
Railway Job
Follow us on

10 month old girl gets job in railways: ఈ రోజుల్లో ఉద్యోగ సంపాదన అంత సులువైన పనికాదు. అందునా ప్రభుత్వ ఉద్యోగమంటే తలకిందులుగా తపస్సు చేయవల్సిందే. కఠోర శ్రమతో.. రాత్రింబగళ్లు కష్టపడి చదివితే తప్ప ఉద్యోగం వరించదు. అలాంటిది ఓ 10 నెలల చిన్నారికి ఏకంగా రైల్వే ఉద్యోగం లభించింది. బహుశా! రైల్వే చరిత్రలో ఇంత చిన్న వయసు పసికందుకు ఉద్యోగం ఇవ్వడం ఇదే మొదటిసారి అయ్యి ఉంటుంది. వివరాల్లోకెళ్తే.. ఛత్తీస్​గఢ్​రాష్ట్రానికి చెందిన సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని రాయ్‌పూర్ రైల్వే డివిజన్ అరుదైన కారుణ్య నియామకం జరిగింది. 10 నెలల రాధిక అనే బాలికకు కారుణ్య నియామకం కింద రైల్వే అధికారులు బుధవారం రైల్వే ఉద్యోగం కోసం రిజిస్ట్రేషన్ చేశారు. నిబంధనల ప్రకారం చిన్నారికి 18 ఏళ్లు నిండిన తర్వాత రైల్వే శాఖ ఆ ఉద్యోగాన్ని ఇవ్వనుంది.

నిజానికి.. రాధిక తండ్రి రాజేంద్ర కుమార్ యాదవ్ భిలాయ్‌లోని పీపీ యార్డ్‌లో అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. జూన్ 1న రాజేంద్ర కుమార్ తన కుటుంబంతో కలిసి భిలాయ్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రాజేంద్ర, అతని భార్య మంజు యాదవ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరి పాప రాధిక మాత్రమే ఈ ప్రమాదం నుంచి బయటపడింది. తల్లిదండ్రులను కోల్పోయిన రాధికను అమ్మమ్మ పెంచుతుంది. నిబంధనల ప్రకారం ఇటీవల రాజేంద్రకుమార్ స్థానంలో ఆయన కూతురు రాధికకు కారుణ్య నియమకానికి కుటుంబ సభ్యులు దరఖాస్తు చేశారు. దీంతో స్పంధించిన అధికారులు రాధికకు 18 యేళ్లు నిండాక రైల్వేలో ఉద్యోగం ఇస్తామన్నారు. ఈ మేరకు కారుణ్య నియామకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేశారు.