మొదటి దశ ప్రైవేట్ రైళ్లు ఎప్పుడు రానున్నాయంటే..!

| Edited By:

Jul 20, 2020 | 7:13 AM

దేశంలోకి ప్రైవేట్‌ రైళ్ల రాకకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి దశలో 12 రైళ్లను 2022–23లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రణాళికను రచిస్తోంది.

మొదటి దశ ప్రైవేట్ రైళ్లు ఎప్పుడు రానున్నాయంటే..!
Follow us on

దేశంలోకి ప్రైవేట్‌ రైళ్ల రాకకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మొదటి దశలో 12 రైళ్లను 2022–23లో ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రణాళికను రచిస్తోంది. అలాగే 2023–24లో 45 రైళ్లు.. 2027 నాటికి మొత్తం 151 రైళ్లు రాబోతున్నాయి. కాగా దేశవ్యాప్తంగా 109 మార్గాల్లో 151  ఆధునిక ప్యాసింజర్‌ రైళ్లను నడపడం కోసం ఇటీవలే రైల్వే శాఖ, ప్రైవేట్‌ కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానించిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది మార్చిలో దీనికి సంబంధించిన టెండర్లను ఖరారు చేయనున్నారు. ఈ క్రమంలో 2023 మార్చి నుంచి ప్రైవేట్‌ రైళ్ల కార్యకలాపాలు ప్రారంభించాలని నిర్ణయించారు. కాగా 151 ప్రైవేట్‌ రైళ్ల ద్వారా రైల్వే శాఖకు ఏడాదికి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది.