Lottery: అదృష్టం అంటే ఇతనిదేనేమో.. అలా ఉద్యోగం పోయింది.. ఇలా కోట్ల సొమ్ము వచ్చేసింది..

|

Dec 22, 2020 | 5:31 AM

దురదృష్టం వందసార్లు తలుపు తడితే.. అదృష్టం ఒక్కసారైనా తలుపు తడుతుందట! అలా అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే అప్రమత్తమై ఆ అదృష్టాన్ని

Lottery: అదృష్టం అంటే ఇతనిదేనేమో.. అలా ఉద్యోగం పోయింది.. ఇలా కోట్ల సొమ్ము వచ్చేసింది..
Follow us on

Lottery: దురదృష్టం వందసార్లు తలుపు తడితే.. అదృష్టం ఒక్కసారైనా తలుపు తడుతుందట! అలా అదృష్టం తలుపు తట్టినప్పుడు వెంటనే అప్రమత్తమై ఆ అదృష్టాన్ని ఇంట్లోకి ఆహ్వానించాలట! ఇక్కడ ఓ భారతీయుడి పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. మ్యాటర్ ఏంటంటే.. భారతదేశంలోని కేరళ ప్రాంతానికి చెందిన నవనీత్ సజీవన్(30) దంపతులు దుబాయ్‌లో సెటిల్ అయ్యారు. అయితే కరోనా మహమ్మారి కారణంగా అతను తన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ క్రమంలో అతను ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. చివరికి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నాలు సాగించాడు.

 

ఒక ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వెళ్లి ఇంటికి తిరిగి వెళ్తుండగా డీడీఎఫ్(దుబాయ్ డ్యూటీ ఫ్రీ) నుండి ఫోన్ కాల్ వచ్చింది. మీరు ఒక మిలియన్ డాలర్ల(ఇండియన్ కరెన్సీలో రూ. 7.3 కోట్లు) ప్రైజ్ మనీ గెలుచుకున్నారంటూ ఆ ఫోన్ కాల్ సందేశం. దాంతో అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోయాడు. ఈ విషయాన్ని తన స్నేహితులతో పంచుకున్నాడు. లాటరీ గెలిచిన నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన నవనీత్.. ‘నా భార్య ప్రస్తుతం ఉద్యోగం చేస్తోంది. నాకు సరైన ఉద్యోగం దొరక్కపోతే స్వస్థలానికి వెళ్లిపోదామనుకున్నాను. నాకు ఇప్పటికే లక్ష దిహ్రమ్‌ల అప్పు ఉంది. ఈ జాక్‌ పాట్ నాకు రావడం చాలా ఆనందంగా ఉంది. అప్పులు తిరిపోతాయి.’ అని నవనీత్ చెప్పుకొచ్చాడు.

Lottery Related Tweet: