సువాసనలు వెదజల్లే ‘బాసుమతి జొన్న’

| Edited By: Pardhasaradhi Peri

May 26, 2020 | 11:58 AM

సువాసనలను ఇచ్చే వరి వంగడం బాస్మతి. ఇది భారతదేశంలో సాంప్రదాయకంగా పండిస్తున్న ఆరోమాటిక్ బియ్యం. వీటితోపాటు మరికొన్ని రకాల దేశీ వరి వంగడాలు సువాసనను ఇస్తాయి. అయితే సువాసనను వెదజల్లే వరి వంగడమే కాదు… జొన్న వంగడం కూడా ఒకటి ఉంది. హైదరాబాద రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ఈ కొత్త రకాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. సంప్రదాయ జొన్న సీడ్‌లపై చేస్తున్న పరిశోధనల్లో ఈ రకం వంగడం మధ్యప్రదేశ్‌లో ‘బాసుమతి జొన్న’ గుర్తించారు శాస్త్రవేత్త డాక్టర్‌ […]

సువాసనలు వెదజల్లే ‘బాసుమతి జొన్న’
Follow us on

సువాసనలను ఇచ్చే వరి వంగడం బాస్మతి. ఇది భారతదేశంలో సాంప్రదాయకంగా పండిస్తున్న ఆరోమాటిక్ బియ్యం. వీటితోపాటు మరికొన్ని రకాల దేశీ వరి వంగడాలు సువాసనను ఇస్తాయి. అయితే సువాసనను వెదజల్లే వరి వంగడమే కాదు… జొన్న వంగడం కూడా ఒకటి ఉంది. హైదరాబాద రాజేంద్రనగర్‌లోని భారతీయ చిరుధాన్యాల పరిశోధనా సంస్థ ఈ కొత్త రకాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.

సంప్రదాయ జొన్న సీడ్‌లపై చేస్తున్న పరిశోధనల్లో ఈ రకం వంగడం మధ్యప్రదేశ్‌లో ‘బాసుమతి జొన్న’ గుర్తించారు శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం. ఇలంగోవన్‌. ఛత్తర్‌పూర్ జిల్లా బిజావర్ సమీపంలోని కర్రి, సర్వ గ్రామాల ప్రజలు సువాసన కలిగిన జొన్నను పండిస్తున్నారని గుర్తించారు. ఇప్పటికే ఈ ‘బాసుమతి జొన్న’ పంట అంతరించిపోయిందని వెల్లడించారు. అతికష్టం మీద నాలుగైదు కంకులను సేకరించారు ఐఐఎంఆర్‌‌లోని శాస్త్రవేత్త డాక్టర్‌ ఎం. ఇలంగోవన్‌. ఇక్కడితో ఆగిపోకుండా.. అదే జిల్లాలోని కటియ, కెర్వన్ గ్రామాల్లోని కొందరు రైతులను ఒప్పించారు. అందుకు అంగీకించిన రైతులు ఈ వంగడాన్ని పంటగా వేశారు. అయితే అంతరించిపోతున్న అత్యంత అరుదైన జొన్న వంగడాన్ని సేకరించి, తిరిగి సాగులోని తెస్తున్న వీరి ప్రయత్నాలు ఫలించాలని కోరుకుందాం.