Ladakh Tank Accident: లడఖ్ సైనిక విన్యాసాల్లో అపశృతి.. ఐదుగురు జవాన్ల వీరమరణం!

|

Jun 29, 2024 | 11:55 AM

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో సమీపంలో శనివారం (జూన్ 29న) ఘోర ప్రమాదం జరిగింది. దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో సైనిక విన్యాసాల సందర్భంగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.

Ladakh Tank Accident: లడఖ్ సైనిక విన్యాసాల్లో అపశృతి.. ఐదుగురు జవాన్ల వీరమరణం!
Indian Army's Tanks
Follow us on

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లో సమీపంలో శనివారం (జూన్ 29న) ఘోర ప్రమాదం జరిగింది. దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో సైనిక విన్యాసాల సందర్భంగా ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం, LAC సమీపంలో నదిని దాటుతుండగా ఈ ప్రమాదం జరిగింది.

దౌలత్ బేగ్ ఓల్డి ప్రాంతంలో ఆర్మీ సైనికులు నదిలో ట్యాంక్ క్రాసింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సమయంలో నది నీటిమట్టం ఒక్కసారిగా పెరగడంతో ట్యాంక్ నీటిలో చిక్కుకుంది. ఈ మేరకు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో మరికొంత మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. లడఖ్‌లోని ఎల్‌ఎసి సమీపంలో అకస్మాత్తుగా వచ్చిన వరదలో ఐదుగురు ఆర్మీ సైనికులు కొట్టుకుపోయారని అధికారులు తెలిపారు. నీటిలోంచి ఇప్పటి వరకు కొందరి మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..

ప్రమాదం జరిగిన సమయంలో ఆర్మీ యుద్ద ట్యాంక్‌లో ఐదుగురు ఆర్మీ సిబ్బంది ఉన్నారని రక్షణ అధికారులు వెల్లడించాయి. ఇందులో ఒక JCO , నలుగురు సైనికులు ఉన్నారు. ఆర్మీ ట్యాంక్ నదిలో లోతైన భాగాన్ని దాటుతుండగా, అక్కడే చిక్కుకుపోయింది. ఈ సమయంలో, నీటి మట్టం ఒక్కసారిగా పెరగడంతో, యుద్ధ ట్యాంక్ నీటితో నిండిపోయింది. దాని కారణంగా సైనికులు కొట్టుకుపోయారు. ఒక జవాన్‌ ఆచూకీ లభించగా, మిగిలిన నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. దౌలత్ బేగ్ ఓల్డీలో ప్రమాదానికి గురైన ట్యాంక్ భారత సైన్యానికి చెందిన T-72 ట్యాంక్. భారతదేశంలో 2400 T-72 ట్యాంకులు ఉన్నాయి. భారత సైన్యం చాలా కాలంగా ఈ ట్యాంకులను ఉపయోగిస్తోంది. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ అనేక ఇతర ట్యాంకులు కూడా ఉన్నాయి.

గత నెలలో దౌలత్ బేగ్ ఓల్డీలో ఆర్మీ ట్యాంక్ మరమ్మతుల కేంద్రాన్ని నిర్మించారు. సైనిక సన్నద్ధతను పటిష్టం చేసేందుకు చైనా సరిహద్దుకు సమీపంలో తూర్పు లడఖ్‌లో రెండు ట్యాంక్ మరమ్మతు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో ఒకటి దౌలత్ బేగ్ ఓల్డిలో, మరొకటి నియోమాలో నిర్మించారు. 14,500 అడుగుల ఎత్తులో స్థాపించిన ఈ కేంద్రం.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ట్యాంక్ మరమ్మతు కేంద్రం. దాదాపు 500 ఆర్మీ ట్యాంకులను ఇక్కడ మోహరించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..