Corona Vaccines: కరోనా వ్యాక్సిన్‌ ఎగుమతిని ముమ్మరం చేసిన భారత్‌.. ముందస్తు ఒప్పందాల ప్రకారం ఇతర దేశాలకు పంపిణీ

|

Jan 23, 2021 | 4:35 PM

Corona Vaccines: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఇప్పటికే స్వదేశంలో అనుమతి పొందిన కరోనా...

Corona Vaccines: కరోనా వ్యాక్సిన్‌ ఎగుమతిని ముమ్మరం చేసిన భారత్‌.. ముందస్తు ఒప్పందాల ప్రకారం ఇతర దేశాలకు పంపిణీ
Follow us on

Corona Vaccines: ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలో వ్యాక్సినేషన్‌ కొనసాగుతోంది. ఇప్పటికే స్వదేశంలో అనుమతి పొందిన కరోనా వ్యాక్సిన్‌ను ఇతర దేశాలకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ముమ్మరం చేసినట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఇందులో భాగంగా సౌదీఆరేబియా, దక్షిణాఫ్రికా, బ్రెజిల్‌, మొరాకో, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ దేశాలకు ముందస్తు ఒప్పందాల ప్రకారం కోవిడ్‌ టీకా సరఫరా చేస్తున్నట్లు పేర్కొంది. భూటాన్‌కు లక్షా 50 వేల డోసులు, మల్దీవులకు లక్ష, బంగ్లాదేశ్‌కు 20 లక్షలు, నేపాల్‌కు 10 లక్షలు, మయన్మార్‌కు 15 లక్షలు, సెచెల్లీస్‌కు 50 వేల చొప్పున కొవిషీల్డ్‌ డోసులను సరఫరా చేశామని కేంద్ర విదేశాంగ తెలిపింది.

అయితే ఇతర దేశాలకు వ్యాక్సిన్‌ సరఫరా చేసినట్లుగానే పాకిస్తాన్‌కు కూడా సరఫరా చేస్తారా..? లేదా అన్న ప్రశ్నకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ స్పందించారు. భారత్‌తో ఒప్పంద వివరాలు తనకు తెలియని క్లారిటీ ఇచ్చారు. అలాగే బ్రెజిల్‌, మొరాకో దేశాలతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వ్యాక్సిన్‌లను పంపించామని, నియంత్రణ సంస్థల నుంచి అనుమతి వచ్చిన తర్వాతే అప్ఘానిస్థాన్‌లకు కూడా సరఫరా చేస్తామని ఆయన వెల్లడించారు.

భారత్‌ బయోటెక్‌ తయారు చేసిన కొవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి తుది దశ ప్రయోగాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా 25,800 మందికి ప్రయోగ టీకా అందించగా, వీరిలో 13 వేల మందికి రెండో డోసు ఇచ్చినట్లు సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల ట్విటర్‌లో వెల్లడించారు. మరో వైపు తొలి రెండు దశ ప్రయోగాల్లో కొవాగ్జిన్‌ మెరుగైన ఫలితాలను నమోదు చేయడంతో పాటు నిగనిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుందని లాన్సెట్‌ నివేదిక వెల్లడించింది.

Also Read: ఫైజర్ బాటలోనే మేమూ, తగ్గిపోయిన ఉత్పత్తి, ఈయూ దేశాలకు సరఫరాను కుదిస్తాం, ఆస్ట్రాజెనికా ప్రకటన