Corona Vaccine: శ్రీలంకకు ఐదు లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను బహుమతిగా పంపిన భారత ప్రభుత్వం

|

Jan 28, 2021 | 5:29 AM

Corona Vaccine: భారత్‌ నుంచి ఐదు లక్షల కొవిషీల్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ డోసులు గురువారం శ్రీలంకకు చేరుకోనున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక దేశాలకు బహుమతిగా..

Corona Vaccine: శ్రీలంకకు ఐదు లక్షల కరోనా వ్యాక్సిన్‌ డోసులను బహుమతిగా పంపిన భారత ప్రభుత్వం
Covishield Vaccine
Follow us on

Corona Vaccine: భారత్‌ నుంచి ఐదు లక్షల కొవిషీల్డ్‌ కరోనా వ్యాక్సిన్‌ డోసులు గురువారం శ్రీలంకకు చేరుకోనున్నాయి. భారత ప్రభుత్వం ఇప్పటికే అనేక దేశాలకు బహుమతిగా వ్యాక్సిన్‌ డోసులను పంపింది. వ్యాక్సిన్‌ మైత్రి పేరిట ఇప్పటి వరకు ఏడు దేశాలకు వ్యాక్సిన్‌ డోసులను పంపగా, ఇప్పుడు శ్రీలంకతో కలిపి ఈ జాబితా ఎనిమిదికి చేరింది. శ్రీలంక ఆహ్వానం మేరకు విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ జనవరి 5-7 మధ్య శ్రీలంక పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో తమ దేశానికి భారత్‌ వ్యాక్సిన్‌ డోసులను ఇవ్వాలని శ్రీకలం కోరింది. ఈ మేరకు వ్యాక్సిన్‌లను పంపించింది భారత్‌.

మరో పక్క గత ఏడాది సెప్టెంబర్‌లో శ్రీలంక ప్రధాని మహీంద్ర రాజపక్సతో ప్రధాని నరేంద్రమోదీ వర్చువల్‌ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ సమయంలో శ్రీలంకలో కరోనా మహమ్మ కారణంగా తీవ్ర నష్టాన్ని తీర్చేందుకు తమకు తోచిన సాయం అందిస్తామంటూ ప్రధాని మోదీ మాటిచ్చారు. దీనిలో భాగంగా భారత ప్రభుత్వం ఇప్పుడు ఐదు లక్షల కొవిషీల్డ్ టీకాలను శ్రీలంకకు అందిస్తోంది. గతంలో శ్రీలంక ప్రభుత్వానికి భారత ప్రభుత్వం 26 టన్నుల మందులను, మెడికల్‌ పరికరాలను కూడా అందించింది.

Also Read: జాన్సన్ & జాన్సన్ కరోనా వ్యాక్సిన్‌ ప్రయోగ ఫలితాలు.. మార్కెట్‌లోకి సింగిల్‌ డోసు టీకా.. ఎప్పుడో తెలుసా..