
India Coronavirus Updates: భారత్‌లో కరోనా కేసులు భారీగా తుగ్గుముఖం పడుతున్నాయి. కరోనా థర్డ్‌వేవ్ అనంతరం రోజువారి కేసుల సంఖ్య 20 వేలకు దిగువన నమోదవుతోంది. ఈ క్రమంలో శనివారం కేసుల మరింత తగ్గింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,273 కరోనా కేసులు (Coronavirus) నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా నిన్న 243 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ (Health Ministry) ఆదివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం దేశంలో డైలీ పాజిటివిటీ రేటు 1.00 శాతానికి తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 1,11,472 (0.26%) కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. దేశంలో మహమ్మారి కేసుల సంఖ్య 4,29,16,117 కి పెరగగా.. ఇప్పటివరకు కరోనాతో 5,13,724 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
కాగా.. నిన్న కరోనా (Covid-19) మహమ్మారి నుంచి 20,439 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 4,22,90,921 కి చేరింది. ప్రస్తుతం రికవరీ రేటు 98 శాతానికిపైగా ఉంది. ఇదిలాఉంటే.. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 1,77,44,08,129 టీకా డోసులను పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
Also Read: