రైతుల నిరసనలపై తప్పుడు సమాచారం, ట్విటర్ ప్రతినిధులతో భేటీలో ఐటీ శాఖ కార్యదర్శి విచారం

| Edited By: Anil kumar poka

Feb 11, 2021 | 11:15 AM

ఇండియాలో రైతుల నిరసనలపై ట్విటర్ తప్పుడు సమాచారాన్ని, రెచ్ఛగొట్టే కంటెంట్ ను ఇస్తోందని ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సానే విచారం వ్యక్తం చేశారు.

రైతుల నిరసనలపై తప్పుడు సమాచారం, ట్విటర్ ప్రతినిధులతో భేటీలో  ఐటీ శాఖ కార్యదర్శి విచారం
Follow us on

ఇండియాలో రైతుల నిరసనలపై ట్విటర్ తప్పుడు సమాచారాన్ని, రెచ్ఛగొట్టే కంటెంట్ ను ఇస్తోందని ఎలెక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి అజయ్ ప్రకాష్ సానే విచారం వ్యక్తం చేశారు. భారత ప్రభుత్వం తరఫున ఆయన గ్లోబల్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మోనిక్  మెఖ్, డిప్యూటీ జనరల్ కౌన్సెల్ వైస్ ప్రెసిడెంట్ జిమ్ బేకర్ తో వర్చ్యువల్ గా ఇంటరాక్ట్ అయ్యారు. భావ ప్రకటనా స్వేఛ్చకు తాము గౌరవమిస్తామని, ఇది ప్రజాస్వామ్యంలో భాగమని, పైగా వ్యక్తుల ప్రాథమిక హక్కని ఆయన అన్నారు. అయితే ఈ స్వేచ్చకు సంబంధించి భారత రాజ్యాంగంలోని అధికరణం 19 (2) కింద కొన్ని సహేతుక  ఆంక్షలు ఉన్నాయన్నారు. ఇండియాలో మీ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చునని, ఇక్కడ ఇందుకు అనువైన వాతావరణం ఉందని ఆయన చెప్పారు. మీరు భారతీయ చట్టాలను, ప్రజాస్వామిక సంస్థలను గౌరవించాల్సి ఉంటుందన్నారు. మీకు సొంత నిబంధనలు, గైడ్ లైన్స్ ఉన్నాయి..కానీ మా దేశ పార్లమెంట్ అమలు చేస్తున్న చట్టాలకు అనుగుణంగా నడచుకోవాల్సి ఉంటుంది..అన్నారు.  ఫార్మర్ జీనోసైడ్ పేరిట హ్యాష్ ట్యాగ్ ను వినియోగిస్తూ హానికరమైన కంటెంట్ ను ట్విటర్ ఇవ్వడం పట్ల అజయ్ తీవ్ర విచారాన్ని ప్రకటించారు.  దీన్ని తొలగించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు.

వాషింగ్టన్ లో క్యాపిటల్ హిల్ ఎపిసోడ్ ని, ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన ఘటనలను మీ సంస్థ ఎలా హ్యాండిల్ చేసిందన్న  అంశాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ రెండు వేర్వేరు ఘటనలను మీరు వేర్వేరుగా డీల్ చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. రైతుల ప్రొటెస్ట్ లపై ఓ పరాయి దేశంలో ఓ బలమైన సోషల్ మీడియా ద్వారా ప్రచారం జరుగుతోందని టూల్ కిట్ ద్వారా వెల్లడైందన్నారు. ఇండియాలో ఈ విధమైన ప్రచారాలను, సామరస్య వాతావరణాన్ని భంగపరచేందుకు ట్విటర్ ను వినియోగించుకుంటున్నారన్న  విషయం అవగతమైందన్నారు. ఈ విధమైన ప్రచారాలకు అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ట్విటర్ పై ఉందన్నారు. కాగా- భారత చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని , వాటికీ కట్టుబడి ఉంటామని ట్విటర్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఇండియాలో మా సర్వీసులను కొనసాగిస్తామని, భారత ప్రభుత్వానికి, మా గ్లోబల్ టీమ్ కి మధ్య సామరస్య వాతావరణం ఉండేలా మీరు కూడా చొరవ తీసుకోవాలని వారు కోరారు.

Read More :Duck vs 4 Tigers Video: నాలుగు పులులను ఒక ఆటాడున్న బాతు..ఈ బాతు దైర్యం చూస్తే అవాక్ అవ్వాల్సిందే.

Read More :Crocodile Attack on Deer Video: మొసలికి ఆహారంగా మారి తల్లి జింక బలి..బిడ్డ కోసం.

Read More :India Corona: కరోనాతో గత 24 గంటల్లో 108 మంది మృతి.. ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..?