India Corona Cases: దేశంలో మరో 14,545 మందికి కరోనా.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా

|

Jan 22, 2021 | 11:01 AM

దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా దేశంలో 8,00,242 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,545 కొత్త కేసులు నమోదయ్యాయి.

India Corona Cases: దేశంలో మరో 14,545 మందికి కరోనా.. యాక్టివ్ కేసులు, మరణాల వివరాలు ఇలా
India corona latest updates
Follow us on

India Corona Cases: దేశంలో కరోనా వైరస్‌ వ్యాప్తి అదుపులోనే ఉంది. కొత్తగా దేశంలో 8,00,242 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 14,545 కొత్త కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 1,06,25,428కి చేరింది. మరోవైపు, గురువారం మరో 163 మంది వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. మొత్తం మరణాల సంఖ్య 1,53,032కి చేరింది. ఇక, దేశంలో రికవరీ కేసుల సంఖ్య 1,02,83,708 కోట్లుగా ఉండగా..యాక్టివ్ కేసుల సంఖ్య  1,88,688 తగ్గింది. ప్రస్తుతం రికవరీ రేటు 96.78 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల రేటు 1.78 శాతానికి తగ్గింది.

దేశంలో గురువారం సాయంత్రం(6గంటల) వరకు మొత్తం 9,99,065 మందికి కోవిడ్-19 వ్యాక్సిన్ అందించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది. మొత్తం 18,159 సెషన్లలో ఈ వ్యాక్సిన్ నిర్వహణ చేపట్టినట్టు ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్​ అగ్నాని పేర్కొన్నారు. టీకా పంపిణీ ప్రారంభమైన ఆరోరోజున(గురువారం).. 27 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 1,92,581 మంది వ్యాక్సిన్​ వేయించుకున్నట్టు వెల్లడించారు.

Also Read :

Telangana Intermediate Board: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీకి రాకున్నా పరీక్షలు రాయొచ్చు..!

Begger Free HYD: భాగ్య నగరాన్ని బెగ్గర్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు మరో ముందడుగు.. జీహెచ్‌ఎమ్‌సీ స్పెషల్‌ డ్రైవ్‌..