పాక్‌ గగనతలంలో విమానాలకు నో ఎంట్రీ.. మళ్లీ చేతులు కలపబోతున్న భారత్‌, చైనా..!

భారత్‌, చైనా మళ్లీ చేతులు కలపబోతున్నాయి. పహల్గామ్‌ ఎటాక్‌ తర్వాత పాకిస్తాన్‌ తన గగనతంలోకి భారత విమానాల ఎంట్రీకి బ్రేక్‌ పడటంతో.. చైనాతో భారత చర్చలు జరుపుతోంది. చర్చలు సఫలమైతే ముంబై, ఢిల్లీ నుంచి బయలుదేరే విమానాలు ఇక లేహ్‌ నుంచి చైనా భూభాగంలోకి ఎంటరై.. కజికిస్తాన్‌ మీదుగా ప్రయాణించే అవకాశం ఉంది.

పాక్‌ గగనతలంలో విమానాలకు నో ఎంట్రీ.. మళ్లీ చేతులు కలపబోతున్న భారత్‌, చైనా..!
India China Airspace Talks

Updated on: Sep 30, 2026 | 7:56 AM

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్, తదనంతర పరిణామాలతో భారత్‌ విమానయాన సంస్థలకు పాకిస్తాన్ తన గగనతలాన్ని మూసేసింది. దీంతో పాకిస్తాన్ మీదుగా వెళ్లాల్సిన భారత విమానాలు చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. ఐరోపా, ఉత్తర అమెరికా వైపు వెళ్లే విమానాలు ఇతర మార్గాల్లో వెళ్తున్నాయి. దీనివల్ల ప్రయాణ సమయం, నిర్వహణ ఖర్చు పెరగడం వల్ల విమానయాన సంస్థలపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో భారత్ గత ఏడాది కాలంగా ప్రత్యామ్నాయ మార్గాల్ని అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా చైనాలోని హోటాన్ మీదుగా విమానాలు నడిపేందుకు అనుమతివ్వాలని డ్రాగన్ ను కోరుతోంది.

అయితే ఇన్నాళ్లూ భారత్‌ చేసిన ఈ ప్రతిపాదనపై చైనా స్పందించడం లేదు. కానీ తాజాగా బ్రిక్స్ సదస్సు సందర్భంగా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ భారత్‌లో పర్యటించినప్పుడు.. ప్రధాని మోడీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చైనా అధికారులతో భారత అధికారులు చర్చలు జరుపుతున్నారు. భారత విమానయాన సంస్థలకు ప్రత్యామ్నాయ మార్గంగా జిన్‌జియాంగ్ గగనతలాన్ని ఇచ్చేందుకు భారత్.. చైనాతో చర్చలు జరుపుతోందని అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ మార్గాలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ చైనా ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోందని వారు స్పష్టం చేశారు.

జిన్‌పింగ్ ఢిల్లీ పర్యటనకు ముందు..

జిన్‌పింగ్ ఢిల్లీ పర్యటనకు ముందు, చైనా సదరన్ ఎయిర్‌లైన్స్, ఆరు సంవత్సరాలుగా నిలిపివేసిన మార్గాన్ని పునరుద్ధరిస్తూ.. సెప్టెంబర్ 21 నుండి గ్వాంగ్‌జౌ-న్యూఢిల్లీ మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ మహమ్మారి, భారత్-చైనా సరిహద్దు వెంబడి నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నంలో ఇదొక భాగం. భారత్-చైనా మధ్య పునఃప్రారంభించిన తొలి భారతీయ విమానయాన సంస్థ ఇండిగో. గత అక్టోబర్‌లో కోల్‌కతా-గ్వాంగ్‌జౌ మధ్య ఇండిగో సర్వీసులను పునఃప్రారంభించింది. నవంబర్‌లో ఢిల్లీ-గ్వాంగ్‌జౌ మధ్య కూడా భారత్-చైనా ప్రత్యక్ష విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించింది. ఆ తర్వాత ఎయిర్ ఇండియా ఫిబ్రవరి 1న ఢిల్లీ-షాంఘై సర్వీసులను నడిపింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు చైనా మీదుగా ఇతర దేశాలకు వెళ్లేందుకు భారత్ అనుమతులు కోరుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us