Indo-China: ఇండో-చైనా బోర్డర్‌లో రోజు రోజుకు దిగజారుతోన్న పరిస్థితి. మళ్లీ యుద్ధ మేఘాలు, మోహరింపులు, కవ్వింపు చర్యలు

|

Oct 23, 2021 | 7:14 AM

బోర్డర్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు, భారత్, చైనా కవ్వింపు చర్యలు. యుద్ధ విమానాలు మోహరిస్తున్న ఇరు దేశాలు. ఏదో జరగబోతుందన్న ఆందోళన రోజు రోజుకు

Indo-China: ఇండో-చైనా బోర్డర్‌లో రోజు రోజుకు దిగజారుతోన్న పరిస్థితి. మళ్లీ యుద్ధ మేఘాలు, మోహరింపులు, కవ్వింపు చర్యలు
Indo China Border Tension
Follow us on

India – China Border Tension: బోర్డర్‌లో మళ్లీ యుద్ధ మేఘాలు, భారత్, చైనా కవ్వింపు చర్యలు. యుద్ధ విమానాలు మోహరిస్తున్న ఇరు దేశాలు. ఏదో జరగబోతుందన్న ఆందోళన రోజు రోజుకు పెరుగుతోంది. సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి చైనా కవ్వింపులకు భారత్‌ దీటుగా బదులిస్తోంది. చైనా పెద్దఎత్తున యుద్ధ విమానాలు, సైన్యాన్ని మోహరించగా.. మన దేశం కూడా అదే తరహాలో రాకెట్‌ వ్యవస్థలను సరిహద్దులకు తరలిస్తోంది. యుద్ధం జరిగితే శత్రువులకు తగిన రీతిలో బుద్ధిచెప్పేందుకు అన్ని వ్యవస్థలను సిద్ధంచేస్తూ నిత్యం మాక్‌డ్రిల్ నిర్వహిస్తోంది. భారత్‌- చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో సైన్యం అనునిత్యం అప్రమత్తంగా ఉంటూ పహారా కాస్తోంది.

శత్రుదేశంలో కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లే సామర్థ్యంతో పినాక, స్మెర్చ్‌ రాకెట్‌ వ్యవస్థలను రూపొందించింది. అత్యంత శక్తిమంతమైన ఈ రెండు రాకెట్‌ వ్యవస్థలను అసోం ఈస్ట్రన్‌ సెక్టార్‌లో పలుచోట్ల ఏర్పాటు చేసింది. ఈ రెండు రాకెట్లను ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేస్తే ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించే అవకాశం ఉంటుందని సైనికాధికారులు చెప్తున్నారు. పినాక రాకెట్‌ వ్యవస్థ కేవలం 44 సెకెన్లలో 75 రాకెట్లను పేల్చగలదు, 100 మీటర్ల పొడవు, 800 మీటర్ల వెడల్పు కలిగిన ప్రాంతాన్ని స్మాష్ చేయగలదు. 75 కిలో మీటర్ల లక్ష్యాన్ని ఛేదించేలా అభివృద్ధి చేసిన పినాక రాకెట్‌ వ్యవస్థ త్వరలో సైన్యంలో చేరనుంది.

మరో రాకెట్‌ వ్యవస్థ స్మెర్చ్‌ 90 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల సామర్థ్యం కలిగి ఉంది. 40 సెకెన్లలో 44 రాకెట్లను పేల్చగల సామర్థ్యంతో స్మెర్చ్‌ రాకెట్‌ వ్యవస్థను రూపొందించారు. ఇది 1200 చదరపు మీటర్ల ప్రాంతాన్నీ ధ్వంసం చేయగలదు. భారత సైన్యంలో అత్యధికంగా 90 కిలో మీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగల సత్తా ఉన్న రాకెట్‌ స్మెర్చ్‌ ఒక్కటే. ఈ రాకెట్‌ వ్యవస్థను భారత్‌ రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం భారత సైన్యంలో మూడు స్మెర్చ్‌ రెజిమెంట్లు ఉన్నాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో డీఆర్‌డీవో రూపొందించిన పినాక రాకెట్‌కు సంబంధించి ప్రస్తుతం నాలుగు రెజిమెంట్లు ఉన్నాయి. మరో ఆరు రెజిమెంట్లను సైన్యం సిద్ధం చేస్తోంది.

Read also: Andhra Pradesh, Telangana News: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి టాప్-9 వార్తలు ఇవే..