‘మహా తుఫాన్’ బీభత్సం..!! అల్లాడుతోన్న ప్రజలు..!

| Edited By:

Nov 01, 2019 | 10:11 AM

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనం బలహీనపడిన కారణంగా.. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని ఐఎండీ తెలిపింది. కాగా.. చెన్నైలో తీవ్ర తుఫాన్‌.. ‘మహా తుఫాన్’గా మారింది. ఐఎండీ హెచ్చరికలతో.. కేరళలోని సుమారు 4 జిల్లాలో.. అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. త్రిసూర్, ఎర్నా కులం, అలుపుల, తిరువనంతపురం జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మత్య్సకారులను కూడా వేటకు వెళ్లొద్దని.. అధికారులు హెచ్చరించారు. కాగా.. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. […]

మహా తుఫాన్ బీభత్సం..!! అల్లాడుతోన్న ప్రజలు..!
Follow us on

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ఆవర్తనం బలహీనపడిన కారణంగా.. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశముందని ఐఎండీ తెలిపింది. కాగా.. చెన్నైలో తీవ్ర తుఫాన్‌.. ‘మహా తుఫాన్’గా మారింది. ఐఎండీ హెచ్చరికలతో.. కేరళలోని సుమారు 4 జిల్లాలో.. అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. త్రిసూర్, ఎర్నా కులం, అలుపుల, తిరువనంతపురం జిల్లా కలెక్టర్లను ప్రభుత్వం అప్రమత్తం చేసింది. విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. మత్య్సకారులను కూడా వేటకు వెళ్లొద్దని.. అధికారులు హెచ్చరించారు.

కాగా.. ఇప్పటికే తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలోని రామనాథపురంతో పాటు పలు జిల్లాల్లో మునుపటి కంటే అత్యధిక వర్షపాతం నమోదవుతోంది. నీలగిరి జిల్లాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయి. సహాయక చర్యలను ముమ్మరం చేసిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు. కన్యాకుమారి, తిరునల్వేలి జిల్లాల్లో పర్యాటక జలపాతాలను మూసివేసిన అధికారులు.

తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. అరేబియా సముద్రంలో కొనసాగుతున్న మహా తుఫాను రాగల 24 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయని వెల్లడించింది. దీని ప్రభావంతో బంగాళాఖాతం ప్రాంతంలోని గాలులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల మీదుగా అరేబియా సముద్రం వైపు వెళ్తున్నాయని.. ఈ కారణంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.