న్యాయం కావాలి.. దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేయాలని IMA పిలుపు..

|

Aug 16, 2024 | 7:23 AM

న్యాయం కావాలంటూ కోల్‌కతా RG కర్‌ హాస్పిటల్‌ డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది చేస్తున్న నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సరైన రక్షణ కల్పిస్తే కల్పిస్తేనే తాము విధులకు హాజరవుతామని ప్రకటించారు. వైద్యులు సురక్షితంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్లు నినదిస్తున్నారు.

న్యాయం కావాలి.. దేశవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేయాలని IMA పిలుపు..
Medicos Protest
Follow us on

న్యాయం కావాలంటూ కోల్‌కతా RG కర్‌ హాస్పిటల్‌ డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది చేస్తున్న నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సరైన రక్షణ కల్పిస్తే కల్పిస్తేనే తాము విధులకు హాజరవుతామని ప్రకటించారు. వైద్యులు సురక్షితంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుందని డాక్టర్లు నినదిస్తున్నారు.

RG కర్‌ మెడికల్‌ కాలేజీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన కోల్‌కతాను కుదిపేస్తోంది. ఆస్పత్రి జూనియర్‌ డాక్టర్లు, నర్సింగ్‌ సిబ్బంది ఆందోళన తీవ్రతరమవుతోంది. న్యాయం కావాలంటూ రాత్రంతా డాక్టర్లు నిరసన కొనసాగించారు. సెంట్రల్‌ హెల్త్‌కేర్‌ పొటెక్షన్‌ యాక్ట్‌ అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోగులను కాపాడే తమ ప్రాణాలు రక్షణ లేకుండా పోతోందని డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నాలుగు రోజులుగా తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని డాక్టర్లు ప్రశ్నిస్తున్నారు. ఆరోగ్య శాఖ ఎందుకు తమను కలవడం లేదని నిలదీస్తున్నారు. బుధవారం ఆస్పత్రిలో జరగిన ఘటనలతో తమకు నమ్మకం పోయిందని డాక్టర్లు అంటున్నారు. ఆస్పత్రి ఎమర్జెన్సీ వార్డులో జరిగిన విధ్వంసంతో సాక్ష్యాలన్నీ మాయమైపోయాయని ఆరోపిస్తున్నారు. న్యాయం కావాలని కోరుతూ నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపల్‌ను నర్సులు ఘెరావ్‌ చేశారు. ఆమె తీరును నర్సులు తీవ్రంగా తప్పుబట్టారు. పొంతన లేకుండా ఆమె మాట్లాడుతున్నారని, ఇది తమకు ఎంత మాత్రం సమ్మతం కాదని అన్నారు. SPOT

మరో వైపు కోల్‌కతా ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. అటు తెలుగు రాష్ట్రాల్లోనూ నిరసనలు కొనసాగుతున్నాయి. విశాఖ KGH జూనియర్‌ డాక్టర్లు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బీచ్‌లో ర్యాలీ నిర్వహించి తమ నిరసనను తీవ్రతరం చేయాలని జూడాల సంఘం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఆందోళనను ఉధృతం చేయాలని IMA పిలుపునిచ్చింది. తిరువనంతపురంలో డాక్టర్లు కోల్‌కతా డాక్టర్లకు సంఘీభావంగా క్యాండిల్‌ మార్చ్‌ నిర్వహించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..