అదరగొట్టిన ఐఐటీ విద్యార్థులు.. కరోనా సంక్షోభ స‌మ‌యంలోనూ రికార్డు స్థాయిలో వేతనాలు. రూ.కోటి ఆఫర్ చేసిన ఏడు కంపెనీలు.

|

Dec 17, 2020 | 9:27 PM

భారత్‌లోని పలు ఐఐటీల్లో ఏడు కంపెనీలు పెద్ద మొత్తంలో వార్షిక ఆదాయాన్ని అందిస్తూ పలువురు విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చాయి. క్యాంపస్ సెలక్షన్లలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏకంగా రూ. కోటి వార్షిక వేతనాన్ని ఆఫర్ చేశాయి.

అదరగొట్టిన ఐఐటీ విద్యార్థులు.. కరోనా సంక్షోభ స‌మ‌యంలోనూ రికార్డు స్థాయిలో వేతనాలు. రూ.కోటి ఆఫర్ చేసిన ఏడు కంపెనీలు.
Follow us on

iit students got one crore package: ఓ వైపు ఏడాది దగ్గరపడుతోన్నా కరోనా సృష్టించిన‌ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. దాదాపు అన్ని రంగాలపై కరోనా ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో పడింది. ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తోన్న వారు కూడా ఎప్పుడు ఉద్యోగం పోతుందా అన్న డైలామాలో ఉన్నారు. ఆర్థిక నష్టాన్ని పూడ్చుకోవడానికి కొన్ని కంపెనీలు ఉద్యోగాలను తొలగించడమో.. పొదుపు చర్యల పేరిట వేతనాలను కత్తిరించడమో చేస్తున్నాయి. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఐఐటీ విద్యార్థులు అద్భుతం సృష్టించారు.
భారత్‌లోని పలు ఐఐటీల్లో ఏడు కంపెనీలు పెద్ద మొత్తంలో వార్షిక ఆదాయాన్ని అందిస్తూ పలువురు విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చాయి. క్యాంపస్ సెలక్షన్లలో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఏకంగా రూ. కోటి వార్షిక వేతనాన్ని ఆఫర్ చేశాయి. ఇటీవల గ్రాడ్యుయేట్ పూర్తి చేసుకున్న 30 మంది విద్యార్థులను ఈ ఏడు కంపెనీలు తమ కంపెనీల్లో నియమించుకున్నాయి. ఐఐటీ-బాంబే, ఐఐటీ-కాన్పూర్‌, ఐఐటీ-ఢిల్లీల్లోని విద్యార్థులు ఈ లక్కీ ఛాన్స్ కొట్టేశారు. ఏడాదికి అందించే ఈ కోటి రూపాయల ప్యాకేజీలో ఈఎస్‌వోపీఎస్‌, పెర్మాపార్మెన్స్‌ బోనస్‌ తదితరాలు ఉన్నాయి.