నేనొక ఫెయిల్యూర్‌ బిజినెస్‌మన్: ‘కాఫీ డే’ డైరక్టర్ చివరి లేఖ

| Edited By: Pardhasaradhi Peri

Jul 30, 2019 | 4:29 PM

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు విజి సిద్ధార్థ అదృశ్యం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రానది నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తరువాత కనిపించకుండా పోయారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్న నేపథ్యంలో సిద్ధార్థ కోసం ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఆయన అదృశ్యమవ్వడానికి ముందు తన కాఫీడే ఉద్యోగులు, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్‌లకు […]

నేనొక ఫెయిల్యూర్‌ బిజినెస్‌మన్: ‘కాఫీ డే’ డైరక్టర్ చివరి లేఖ
Follow us on

కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి అల్లుడు విజి సిద్ధార్థ అదృశ్యం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. సోమవారం సాయంత్రం మంగళూరులోని నేత్రానది నది వంతెనపై నడుచుకుంటూ వెళ్లిన ఆయన ఆ తరువాత కనిపించకుండా పోయారు. ఆయన ఆత్మహత్య చేసుకున్నట్లు ఊహాగానాలు వినిపిస్తోన్న నేపథ్యంలో సిద్ధార్థ కోసం ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలను ముమ్మరం చేశారు పోలీసులు. ఇదిలా ఉంటే ఆయన అదృశ్యమవ్వడానికి ముందు తన కాఫీడే ఉద్యోగులు, కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరక్టర్‌లకు ఓ లేఖను రాశారు.

అందులో ‘‘మా బోర్డ్ ఆఫ్ డైరక్టర్స్, కాఫీ డే ఫ్యామిలీకి.. ఈ 37ఏళ్లతో మా కంపెనీలో 30వేల మంది ప్రత్యక్షంగా, 20వేల మందికి పరోక్షంగా ఉద్యోగవకాశాలను కల్పించాం. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా.. కంపెనీని లాభాల్లోకి తీసుకురావడంలో విఫలమయ్యా. వీటన్నింటిని వదిలేస్తున్నా. నా మీద నమ్మకం పెట్టుకున్న వారందరిని నేను క్షమాపణలు కోరుతున్నా. చాలా సంవత్సరాల నుంచి నేను పోరాడుతున్నా. ఇక నా వల్ల అవ్వడం లేదు. ఓ ప్రైవేట్ ఈక్విటీలోని భాగస్వాములు షేర్లను బైబ్యాక్ చేయమని అంటున్నారు. వాటిని కొనేందుకు నేను నా స్నేహితుడి వద్ద పెద్ద మొత్తంలో అప్పు చేశాను. నాకు అప్పులు ఇచ్చిన వారు ఇవ్వమని బలవంతం చేస్తున్నారు. వీటన్నిటితో నేను విసిగిపోయా. గతంలో ఉన్న ఆదాయపు పన్ను డీజీ నుంచి ఎన్నో వేధింపులు ఎదుర్కొన్నా.

మీరందరూ బలంగా ఉండి.. కొత్త మేనేజ్‌మెంట్‌తో నా వ్యాపారాన్ని ఇలానే కొనసాగించాలని కోరుతున్నా. నా తప్పులన్నింటికీ నాదే బాధ్యత. లావాదేవీల గురించి మా మేనేజ్‌మెంట్‌కు, ఆడిటర్లకు ఏం తెలీదు. వాటన్నింటికి నేను జవాబుదారిని. ఎవర్నీ మోసం చేయాలనుకోలేదు. నేనొక విఫలమైన వ్యాపారవేత్తను. మీరందరూ ఏదో ఒకరోజు నన్ను అర్థం చేసుకొని, క్షమిస్తారని భావిస్తున్నా. నా అప్పులను రుణదాతలకు తీర్చేస్తాను’’ అని లేఖలో పేర్కొన్నారు సిద్ధార్థ.