హ్యుందయ్ కార్ల ఫ్యాక్టరీ మూసివేత.. రీజన్ తెలిస్తే షాక్..!

|

Feb 29, 2020 | 6:56 AM

ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ తన కార్ల ఫ్యాక్టరీని మూసేసింది. ఇది కూడా కరోనా దెబ్బకు. దక్షిణ కొరియాలోని హ్యుందయ్ మోటార్ కంపెనీలోని ఓ ఉద్యోగి కొంతకాలంగా అస్వస్థతకు గురయ్యారు.

హ్యుందయ్ కార్ల ఫ్యాక్టరీ మూసివేత.. రీజన్ తెలిస్తే షాక్..!
Follow us on

ప్రముఖ కార్ల కంపెనీ హ్యుందాయ్ తన కార్ల ఫ్యాక్టరీని మూసేసింది. ఇది కూడా కరోనా దెబ్బకు. దక్షిణ కొరియాలోని హ్యుందయ్ మోటార్ కంపెనీలోని ఓ ఉద్యోగి కొంతకాలంగా అస్వస్థతకు గురయ్యారు. అయితే తాజాగా టెస్టు చేయించడంతో.. ఆ ఉద్యోగికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన కంపెనీ.. వెంటనే ఫ్యాక్టరీని మూసేసింది. దక్షిణ కొరియాలోని ఉల్సాన్‌లోని తమ కార్ల ఫ్యాక్టరీని క్లోజ్ చేస్తున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఇది కరోనా ప్రభావంతోనే అని తెలిపింది. కానీ ఈ వార్త విన్న కాసేపటికే కంపెనీ తన షేర్లను భారీగా నష్టపోయింది. దాదాపు 5శాతానికి పైగా షేర్లు పడిపోయాయి. చైనాలో కరోనా వైరస్ ప్రభావంత తగ్గుముఖం పడుతోందన్న క్రమంలో.. ఇప్పుడిప్పుడే విడి భాగాల తయారీ సంస్థలు కోలుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు హ్యుందయ్ ప్లాంట్ మూతపడటంతో మళ్లీ గందరగోళం నెలకొంది.

కాగా.. చైనా తర్వాత.. కోరానా ప్రభావం ఎక్కువ దక్షిణ కొరియాలోనే ఉంది. ఈ కరోనా ఎఫెక్ట్‌తో శాంసంగ్, హ్యుందయ్ వంటి కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోంది.