సెప్టెంబర్‌ 1 నుంచి 6 జేఈఈ మెయిన్స్..!

|

Jul 22, 2020 | 7:15 PM

ఎట్టకేలకు జేఈఈ మెయిన్స్‌ 2020 పరీక్షల షెడ్యూల్ విడుదైంది. సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్‌ 2020 పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. సెప్టెంబర్‌ 1 నుంచి 6 జేఈఈ మెయిన్స్ వరకు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మరోవైపు JEE ప్రధాన పరీక్షల తేదీలపై UPSC, NDA పరీక్షల తేదీల ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. అదే తేదీల్లో […]

సెప్టెంబర్‌ 1 నుంచి 6 జేఈఈ మెయిన్స్..!
Follow us on

ఎట్టకేలకు జేఈఈ మెయిన్స్‌ 2020 పరీక్షల షెడ్యూల్ విడుదైంది. సెప్టెంబర్ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.

ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన జేఈఈ మెయిన్స్‌ 2020 పరీక్షల షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. సెప్టెంబర్‌ 1 నుంచి 6 జేఈఈ మెయిన్స్ వరకు నిర్వహించాలని మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. మరోవైపు JEE ప్రధాన పరీక్షల తేదీలపై UPSC, NDA పరీక్షల తేదీల ప్రభావం పడే అవకాశం కనిపిస్తుంది. అదే తేదీల్లో ఈ రెండు పరీక్షలు నిర్వహించనున్నారు. సెప్టెంబరు 6న జరగాల్సిన NDA పరీక్షలో JEE మెయిన్‌ పరీక్ష రాసే విద్యార్థులు కూడా కొంతమంది హాజరవుతున్నట్లు సమాచారం. దీంతో మరోసారి JEE పరీక్ష తేదీల్లో మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది.

JEE మెయిన్‌ పరీక్ష తేదీలపై చాలా మంది విద్యార్థులు తమ అభ్యంతరాలను వెల్లడించినట్లు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ నిశాంక. ఈ విషయాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని సూచనప్రాయంగా తెలిపారు. రెండు పరీక్షల్లో హాజరయ్యే అభ్యర్థుల కోసం రెండు పరీక్షలు ఒకే రోజు జరుగకుండా NDA మరో తేదీని నిర్ధారిస్తుందని ట్వీట్‌ చేశారు మంత్రి. జేఈఈ మెయిన్‌ పరీక్షల కోసం సుమారు 9 లక్షలకు పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.