Crop Insurance: పంట నష్టంతో ఆ రాష్ట్ర రైతులు రూ.15 కోట్లకుపైగా బీమా క్లెయిమ్‌ పొందారు: రాజ్యసభలో మంత్రి వెల్లడి

|

Apr 02, 2022 | 1:12 PM

Crop Insurance: రైతుల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతుల పంటలకు బీమా ఉంటుంది...

Crop Insurance: పంట నష్టంతో ఆ రాష్ట్ర రైతులు రూ.15 కోట్లకుపైగా బీమా క్లెయిమ్‌ పొందారు: రాజ్యసభలో మంత్రి వెల్లడి
Follow us on

Crop Insurance: రైతుల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)ని ప్రారంభించింది. ఈ పథకం కింద రైతుల పంటలకు బీమా ఉంటుంది. అదే సమయంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట (Crop)కు నష్టం వాటిల్లితే బీమా క్లెయిమ్ ద్వారా పరిహారం అందజేస్తారు. 2020-21 సంవత్సరంలో ఈ పథకం కింద గోధుమ పంట దెబ్బతిన్నందున హిమాచల్ ప్రదేశ్ రైతులకు 15 కోట్ల కంటే ఎక్కువ బీమా క్లెయిమ్ అందించబడింది. ఈ ఈ విషయాన్ని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ (Minister Narendra Singh Tomar) శుక్రవారం రాజ్యసభలో వెల్లడించారు.

ఈ ఏడాది 1.3 కోట్ల మంది రైతులు పంటలకు బీమా చేశారు:

రాజ్యసభలో కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మాట్లాడుతూ మార్చి 9, 2022 నాటి గణాంకాల ప్రకారం.. 2021-22 రబీ సీజన్‌లో దేశంలో మొత్తం 382 హెక్టార్ల విస్తీర్ణం బీమా చేయబడింది. అదే సమయంలో 2021-22లో మొత్తం 1.3 కోట్ల మంది రైతులు గోధుమ పంటల బీమాను పొందారు. బీమా కోసం అత్యధికంగా రాజస్థాన్ రైతుల నుంచి దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. దీని కింద రాజస్థాన్‌లోని 60 లక్షల మంది రైతులు బీమా పొందగా, ఆ తర్వాత మధ్యప్రదేశ్ ఉన్నట్లు మంత్రి వెల్లడించారు.

జంతువుల వల్ల కలిగే నష్టంపై బీమా క్లెయిమ్:

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన కింద ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే రైతులకు బీమా క్లెయిమ్ ఇస్తారు. కానీ రాష్ట్రాలు కోరితే.. జంతువుల వల్ల పంట దెబ్బతిన్నప్పటికీ బీమా క్లెయిమ్ ఇవ్వవచ్చు.. నిన్న రాజ్యసభలో ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఈ సమాచారం ఇచ్చారు.

ఇవి కూడా చదవండి:

Coriander Water: దనియాల వాటర్‌తో ఎన్నో ప్రయోజనాలు.. ఇలా చేసి చూడండి..!

Paytm: రైలు టికెట్లు బుక్‌ చేసుకోండి.. డబ్బులు తర్వాత చెల్లించండి.. పేటీఎం సరికొత్త ఆప్షన్‌