ముంబై తీరంలో ఎగిసి పడుతున్న అలలు

| Edited By: Pardhasaradhi Peri

Jun 20, 2020 | 2:30 PM

Solar eclipse : ఈదురు గాలులు, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు.. ఇప్పుడు ముంబై తీరంలో కనిపిస్తున్న పరిస్థితి. గ‌త రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి దేశ ఆర్ధిక రాజ‌ధాని ముంబై నగరం తడిసి ముద్దయ్యింది. మ‌రోవైపు ముంబై స‌ముద్ర తీరం అల్ల‌క‌ల్లోలంగా మారింది. భారీ అల‌లు తీరం వైపు వేగంగా దూసుకొస్తున్నాయి. దాదాపు 5.5 నుంచి 6 మీట‌ర్ల ఎత్తుకు అల‌లు ఎగిసిప‌డుతున్నాయి. రానున్న కొన్ని గంట‌ల్లో స‌ముద్ర తీరం మ‌రింత అల్ల‌క‌ల్లోలంగా మారే అవ‌కాశం ఉంద‌ని […]

ముంబై తీరంలో ఎగిసి పడుతున్న అలలు
Follow us on

Solar eclipse : ఈదురు గాలులు, ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న అలలు.. ఇప్పుడు ముంబై తీరంలో కనిపిస్తున్న పరిస్థితి. గ‌త రెండు రోజులుగా కురుస్తున్న వర్షానికి దేశ ఆర్ధిక రాజ‌ధాని ముంబై నగరం తడిసి ముద్దయ్యింది. మ‌రోవైపు ముంబై స‌ముద్ర తీరం అల్ల‌క‌ల్లోలంగా మారింది. భారీ అల‌లు తీరం వైపు వేగంగా దూసుకొస్తున్నాయి. దాదాపు 5.5 నుంచి 6 మీట‌ర్ల ఎత్తుకు అల‌లు ఎగిసిప‌డుతున్నాయి.

రానున్న కొన్ని గంట‌ల్లో స‌ముద్ర తీరం మ‌రింత అల్ల‌క‌ల్లోలంగా మారే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ కేంద్రం హెచ్చ‌రించింది. సముద్రంలోకి మరో రెండు రోజుల వరకు వేటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీచేశారు. అమావాస్య.. సూర్యగ్రహణం సమీపిస్తుండటంతో సముద్రం పోటుకు గురవుతుందని అంటున్నారు.